పుష్పా జాలి రెడ్డికి ఎంపీ సీటు ?, లిస్ట్ లో సౌమ్యా రెడ్డి, ఫైర్ బ్రాండ్ గుండెల్లో దడ !
అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకుని కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు సన్నాహాలు చేసింది. లోక్ సభ ఎన్నికల సమరంలోనూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఓ టార్గెట్ పెట్టుకుంది. ఇలా ప్లాన్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ణాటకలో ఎక్కువ లోక్ సభ స్థానాలు కైవసం చేసుకోవాలని పక్కాప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగా కాంగ్రెస్ నాయకులు అన్ని సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఎంపీ టిక్కెట్లు ఎవరెవరికి ఇవ్వాలి అనే విషయంతో పాటు ఎంపీ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది. బీజేపీ హైకమాండ్ ఇప్పటికే 195 మంది అభ్యర్థుల జాబితాను విడుదల సిద్దం చేసుకుంది. మార్చి 10వ తేదీలోగా ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైంది. ఈ వారంలో కాంగ్రెస్ హైకమాండ్ నేతలు సమావేశం కానున్నారు.

ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో సమావేశమై కేపీసీసీ ఖరారు చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాను సమర్పించనున్నారని తెలిసింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో కనీసం 20 ఎంపీ సీట్లలో విజయం సాధించాలని పక్కాప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 20 ఎంపీ సీట్లలో విజయం సాధిస్తామని సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ పదేపదే బహిరంగంగా ఈ విషయం చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తిన్న బీజేపీ మాత్రం ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చుక్కలు చూపించాలని పక్కాప్లాన్ చేసుకుంటున్నది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్న కొందరు నాయకులకు సీటు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిసింది. అలా కాంగ్రెస్ సీటు దాదాపుగా ఖాయం అయిన నాయకుల జాబితా సోమవారం కన్నడ మీడియాకు లీక్ అయ్యింది.

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పా-1 సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమా అయిన పుష్పా తెలుగుతో పాటు అనేక బాషల్లో దుమ్ములేపి వందల కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డులు తిరగరాసింది. పుష్పా సినిమాలో జాలి రెడ్డిగా నటించిన డాలి దనుంజయ్ అలియాస్ దనుంజయ్ కి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది పుష్పా సినిమాలో జాలి రెడ్డి క్యారెక్టర్ లో విలన్ గా నటించిన జాలి రెడ్డి కన్నడలో మాత్రం ప్రముఖ హీరోల్లో ఒక్కడు.
సినిమా హీరోగానే కాకుండా రచయితగా, సినీ నిర్మాతగా డాలి దనుంజయ్ కి శ్యాండిల్ వుడ్ లో చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీలోను డాలి దనుంజయ్ కి మంచి గుర్తింపు ఉంది. ఇలా పుష్పా జాలి రెడ్డికి మైసూరు-కొడుగు లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చిందని, త్వరలో ఆయన పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని డాలి దనుంజయ్ అభిమానులు, మైసూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. డాలి దనుంజయ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎన్. లక్ష్మణ్ కూడా మైసూరు ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు.

కర్ణాటకలో డాలి దనుంజయ్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. మొత్తం మీద మైసూరు-కొడుగు సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహా (బీజేపీ)కి గట్టి పోటీ ఇచ్చే సత్తా హీరో, నిర్మాత డాలి దనుంజయ్ కి ఉందని ఆయన అభిమానులు అంటున్నారు. అలాగే బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని మాజీ ఎమ్మెల్యే, కర్ణాటక రవాణ శాఖా మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్య రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. బెంగళూరు సౌత్ లోక్ సభ నియోజక వర్గం ఎంపీ టిక్కెట్ సౌమ్యా రెడ్డికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించిందని తెలిసింది












Click it and Unblock the Notifications