నాంపల్లి కోర్టుకు వెంకటేష్, రానా, సురేష్ బాబు.. న్యాయస్థానం సీరియస్ !
తెలుగు చిత్రపరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సీనియర్ నిర్మాతగా రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తూ వెంకటేష్ హీరోగా రాణిస్తుంటే.. సురేష్ బాబు ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు. వారి బాటలోనే ఇప్పుడు రానా సైతం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ఆ ఫ్యామిలీ కోర్టు మెట్టులు ఎక్కనుండడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
హైదరాబాద్ ఫిలిమ్‌నగర్ లోని దక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో.. నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ వివాదంలో దగ్గుబాటి ఫ్యామిలీపై కోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హోటల్ భూమికి సంబంధించి నందకుమార్ అనే వ్యక్తికి దగ్గుబాటి కుటుంబానికి మధ్య పొలానికి సంబంధించిన వివాదం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. నందకుమార్ 2022లో సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు.

దాంతో స్థలాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అదే సంవత్సరం నవంబరులో GHMC అధికారులు బౌన్సర్ల సాయంతో హోటల్‌ను పాక్షికంగా కూల్చారు. ఆ తర్వాత 2024 జనవరిలో దగ్గుబాటి కుటుంబం.. హోటల్‌ను పూర్తిగా కూల్చివేశారు. ఈ చర్యలపై నందకుమార్ తిరిగి నాంపల్లి కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఫిలిమ్‌నగర్ పోలీసులను కేసు నమోదు చేయాలని ఆదేశించింది. పోలీసులు ఐపీసీ సెక్షన్లు 448, 452, 458, 120బీ కింద వెంకటేశ్, సురేష్ బాబు, రానా మీద కేసులు నమోదు చేశారు.
అయితే విచారణకు హాజరుకాలేదు అన్న కారణంగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు ఆలస్యం చేస్తూ కాలయాపన చేస్తుండడంపై కోర్టు సీరియస్ అయ్యింది. అందువల్ల నేడు కోర్టుకు హాజరు కావాలని తప్పనిసరి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేడు దక్కన్ కిచెన్ కూల్చివేత అంశంపై దగ్గుబాటి కుటుంబం కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కోర్టు ఆదేశాలను తిరస్కరిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కోర్టు ఖచ్చితంగా హాజరయ్యేలా ఆదేశించిన నేపథ్యంలో, హాజరు కాకపోతే తదుపరి తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందని న్యాయనిపుణులు భావిస్తున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications