కొత్త దర్శకుడితో దగ్గుబాటి రానా సినిమా..?
టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా కొత్త దర్శకుడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విరాటపర్వం వచ్చి రెండేళ్లవుతున్నా దగ్గుబాటి రానా మళ్లీ పూర్తి స్థాయి సినిమా చేయలేదు. అయితే, ఇటీవలే ఆయన కొత్త దర్శకుడి సినిమాకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. రానా దగ్గుబాటి టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలు చేస్తూనే కథా బలమున్న చిత్రాలకు ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన నిర్మాణంలో రెండు చిత్రాలను ప్రకటించారు. అయితే నటుడిగా మాత్రం ఆయన రెండేళ్లక్రితం ఆయన నుంచి 'విరాట పర్వం' తర్వాత పూర్తిస్థాయి సినిమా రాలేదనే చెప్పాలి.
ఇక, దర్శకుడు తేజతో కూడా ఓ సినిమా ప్రకటించినా అది ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. రజనీకాంత్ సినిమా 'వేట్టయాన్'లో కూడా రానా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వీటితోపాటు రానా నాయుడు సిరీస్ రెండో భాగంలోనూ రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, తాజాగా కొత్త దర్శకుడు కిశోర్ చెప్పిన కథకు రానా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి ఒకే అయినట్లు తెలుస్తోంది. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌లో వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. దగ్గుబాటి రానా బాహుబాలి వంటి సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా చిత్రాల్లో అంటే ఈ రెండేళ్లలో రానా ఎక్కువగా అతిథి పాత్రల్లోనే కనిపించారు.













Click it and Unblock the Notifications