స్టార్ కపుల్ బిగ్ సర్‌ప్రైజ్! ఏడాది తిరగకముందే మళ్లీ ప్రెగ్నెన్సీ
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె మళ్లీ వార్తల్లో నిలిచారు. తన కూతురు దువా పుట్టిన కొద్ది నెలలకే, తాము రెండోసారి తల్లిదండ్రులం కాబోతున్నామంటూ దీపికా - రణ్‌వీర్ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎక్కడా హడావుడి లేకుండా, చాలా నిశ్శబ్దంగా, అత్యంత ప్రేమపూర్వకంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడం విశేషం.
సాధారణంగా సెలబ్రిటీలు ప్రెగ్నెన్సీ గురించి ఫోటోషూట్‌లు చేస్తుంటారు. కానీ, దీపికా మాత్రం డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. తన గర్భధారణ పాజిటివ్ టెస్ట్ రిపోర్టును చిన్నారి దువా పట్టుకుని ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకుండా, కేవలం 'ఈవిల్ ఐ' (దిష్టి చుక్క) ఎమోజీలను మాత్రమే జత చేశారు. అంటే, తన సంతోషానికి ఎవరి దిష్టి తగలకూడదని ఆమె కోరుకున్నట్లు అర్థమవుతోంది. ఇది చూసిన అభిమానులు "దువాకు తోడుగా ప్లేమేట్ వస్తోంది", "దువా ఇప్పుడు బిగ్ సిస్టర్ కాబోతోంది" అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఏడాది తిరగకముందే మరో గుడ్ న్యూస్..
2024 సెప్టెంబర్ 8న ఈ జంటకు దువా జన్మించింది. గత దీపావళి నాడే దువా ముఖాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఈ జంట ఫోటోలను షేర్ చేశారు. దువాకు ఇంకా రెండేళ్లు కూడా నిండకముందే రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవ్వడం ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌గా మారింది. వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచే ఈ జంట, ఇంత త్వరగా ఈ విషయాన్ని బయటపెట్టడం విశేషం.
`
కెరీర్ పరంగా ఫుల్ బిజీ..
ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే, మరోవైపు దీపికా తన ప్రొఫెషనల్ లైఫ్‌లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్‌తో కలిసి "కింగ్" అనే సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం "రాకా" (Raaka) లో కూడా దీపికా కథానాయికగా అలరించబోతున్నారు. ఇక రణ్‌వీర్ సింగ్ కూడా తన "ధూరంధర్: ది రివెంజ్" సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు














Click it and Unblock the Notifications