తల్లి కాబోతున్న దీపికా పదుకొనే.. డెలివరీ ఎప్పుడో చెప్పిన స్టార్ కపుల్!!
బాలీవుడ్ కపుల్ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ లు తమ అభిమానులకు శుభవార్త చెప్పారు. ఈ బాలీవుడ్ స్టార్ కపుల్ త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామని వెల్లడించారు. 38 ఏళ్ల వయసులో దీపికా పదుకొనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇక ఇదే విషయాన్ని ఈ కపుల్ instagram వేదికగా వెల్లడించారు.
ఆరేళ్ల పాటు డేటింగ్ చేసి 2018 లో పెళ్లి చేసుకున్న దీపికా పదుకునే రణవీర్ సింగ్ జంట తాము తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నామని వెల్లడించారు. ఇక ఇదే క్రమంలో సెప్టెంబర్లో డెలివరీ కాబోతున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ పోస్ట్ పై పలువురు సెలబ్రిటీలు దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రియాంక చోప్రా, మాధురి దీక్షిత్, సోనాక్షి సిన్హా, శ్రేయ ఘోషల్, ప్రీతి జింటా, వరుణ్ ధావన్, రకుల్ ప్రీత్, కృతి సనన్ తదితరులు ఈ జంటకు కంగ్రాట్స్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇటీవల లండన్లోని 77వ లండన్‌లోని 77వ BAFTA వేడుకలో దీపిక పదుకొనే తన బేబీ బంప్ కనిపించకుండా, ఆమె తన కడుపుని దాచుకోవడానికి ప్రయత్నించిన తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ పై ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో తాజాగా ఈ జంట instagram ద్వారా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. తమ పోస్టులో అప్పుడే పుట్టిన పసిబిడ్డకు ఉపయోగించే బట్టలు తదితర యాక్సెసరీస్ ను పెట్టి అందులో సెప్టెంబర్ అంటూ డెలివరీ మంత్ ను దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ జంట ప్రకటించారు .
రామ్ లీలా సినిమాలో దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టడం తో పాటు, ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. అప్పుడే వీరు ఇరువురు ప్రేమలో పడ్డారు. అనంతరం బాజీరావు మస్తానీ, పద్మావత్ వంటి సినిమాలలో ఇద్దరు కలిసి నటించారు.
2013లో మొదలైన వీరి ప్రేమ కథ 2018లో పెళ్లిగా మారింది. నవంబర్ 14న ఇటలీలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇక పెళ్లయిన ఆరేళ్ల తర్వాత దీపికా పదుకొనే తల్లి కాబోతున్న విషయాన్ని ఈ జంట అందరికీ షేర్ చేసింది. అభిమానులకు త్వరలోనే జూనియర్ వస్తున్నట్టు ప్రకటించింది.












Click it and Unblock the Notifications