పక్కా హిట్ సినిమా గురు..అదిరిపోయిన టీజర్
నేటి తరం కుర్రకారు వాడే క్రేజీ పదం 'డెలులు' (Delulu) ఆధారంగా తెరకెక్కిన సరికొత్త యూత్‌ఫుల్ మూవీ 'డెలులు'. పోస్టర్‌తోనే అంచనాలు పెంచేసిన మేకర్స్, తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌తో సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. ఒక్క నిమిషం 32 సెకన్ల పాటు సాగే ఈ టీజర్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్విస్తోంది. టీజర్ ఓపెనింగ్ లోనే 'బ్రేకప్ దేవా' అంటూ సరికొత్తగా షురూ అయి, ఆ వెంటనే రాపిడ్ స్పీడ్‌లో కామెడీ సీన్లతో దూసుకెళ్లింది. ముఖ్యంగా డైలాగ్స్ ఈ టీజర్‌కి మేజర్ హైలైట్.
"ఆడదానివైన నువ్వు.. చీప్‌గా ఓ మగాడి కోసం మారతావా.. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నీకు?", "నువ్వేమైనా ఫాదర్ ఆఫ్ ఇండియానా?", "నువ్వు అత్తాపూర్‌కు రారా.. నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా..!" ఇలాంటి పంచ్‌లు టీజర్ అంతటా నవ్వుల వర్షం కురిపించాయి. ప్రత్యేకించి టీజర్ ఆఖరులో వచ్చే ఆ 'లాస్ట్ డైలాగ్' కట్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవల్ ఫన్‌ను జనరేట్ చేస్తూ థియేటర్లలో వినోదం గ్యారెంటీ అనే భరోసానిచ్చింది.

ఒకే ఇంటి బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథనంలో పాత్రల మధ్య ఉండే కెమిస్ట్రీ, టైమింగ్ కామెడీ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతం కస్తూరి దర్శకత్వం వహించారు. విజయ్ రాజ్‌కుమార్ అందించిన కథ, రెష్మిత్ ఎస్. కౌశిక సంభాషణలు చాలా ట్రెండీగా కుదిరాయి. ఆది చెబ్రోలు సంగీతం, జై రాజ్ నాయుడు కెమెరా వర్క్, హరికృష్ణ కురపాటి ఎడిటింగ్ సన్నివేశాల్లోని కామెడీని మరింత ఎలివేట్ చేశాయి.
విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్నలతో పాటు మిగతా నటీనటులు తమ నటనతో అలరించారు. ప్రయోగాత్మక టైటిల్‌తో వస్తున్న ఈ ట్రెండీ కామెడీ ఎంటర్‌టైనర్ వెండితెరపై ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి.














Click it and Unblock the Notifications