వాస్తు ప్రకారం.. ఇంట్లో పెంచుకోవాల్సిన సాటి లేని మొక్క

నగరాల్లో నివసించే చాలామందికి అపార్ట్‌మెంట్లలో మొక్కలు పెంచుకోవడానికి ఇంట్లో పెద్దగా స్థలం ఉండదు. బాల్కనీ మాత్రమే అందుబాటులో ఉంటోంది. వాస్తు ప్రకారం బాల్కనీలో మొక్కలను ఉంచడం అనేది ఇల్లు అందంగా కనిపించడం కోసమే కాదు. వాస్తు నియమాలను కూడా పాటించడం అవసరం. సరైన దిశలో మొక్కలను పెంచడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుందని నమ్ముతారు.

వాస్తు ప్రపంచంలో అనేక రకాల మొక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వీటిలో అపరాజిత లేదా శంఖుపుష్పం మొక్క. బాల్కనీ కోసం అత్యంత అనువైనదిగా చెబుతారు వాస్తు నిపుణులు. నీలి రంగు పువ్వులు పూసే ఈ తీగ మొక్కను ఇంట్లో నాటడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది ఇంట్లో సానుకూల పరిస్థితులను మరింత మెరుగుపరచడమే కాకుండా, చాలా కాలంగా స్తంభించిన పనులను కూడా క్రమంగా పూర్తి చేయడానికి అవకాశాలను కల్పిస్తుందనే విశ్వాసం ఉంది.

Aparajita Plant Placement as per Vastu Benefits North East and Entrance for Good Fortune Directions

వాస్తు ప్రకారం అపరాజిత మొక్కను బాల్కనీలో ఉత్తరం లేదా తూర్పు దిశలలో అమర్చడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ దిశలు దైవిక శక్తులకు నిలయం. ఇక్కడ అపరాజిత మొక్కను ఉంచడం వల్ల ఇంట్లో సంపద నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలలో ఉండే ఆటంకాలు తొలగిపోయి, లాభాల బాట పడతాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు.

వాస్తు ప్రకారం.. తులసి మొక్క నాటే సమయంలో పాటించాల్సినవి
వాస్తు ప్రకారం.. తులసి మొక్క నాటే సమయంలో పాటించాల్సినవి

ఈ మొక్కతో పాటు బాల్కనీలో తులసి, మనీ ప్లాంట్ వంటి మరికొన్నింటిని కూడా పెంచుకోవచ్చు. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన తులసి మొక్కను బాల్కనీలోని ఈశాన్య దిక్కున ఉంచాలి. ఇది గాలిని శుద్ధి చేయడమే కాకుండా, నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. అలాగే మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో ఉంచడం ద్వారా ఆ కుటుంబం పురోగతిని సాధిస్తుందని విశ్వసిస్తారు.

వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?
వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?

గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా బాల్కనీ ఉండాలి. బరువైన మట్టి కుండీలు, పెద్ద పరిమాణంలో ఉండే మొక్కలను బాల్కనీలోని దక్షిణ లేదా పడమర దిశలలో అమర్చడం వాస్తు ప్రకారం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది. సానుకూల వాతావరణం మరింత పెరుగుతుంది. అలాగే తీగ జాతి మొక్కలను పెంచుకోవడానికి నేరుగా గోడలకు తాకకుండా ప్రత్యేక స్టాండ్స్ ఉపయోగించాలి.

ఇదే సమయంలో, బాల్కనీలో ఎలాంటి మొక్కలు ఉంచకూడదో కూడా తెలుసుకోవడం ముఖ్యం. ముళ్ళు ఉన్న కాక్టస్ లాంటి మొక్కలను పెంచుకోకూడదు. తెల్లటి జిగురు లేదా పాలు కారే మొక్కలను బాల్కనీలలో అస్సలు ఉంచకూడదు. ఇవి ఇంట్లోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా ఎండిపోయిన ఆకులు లేదా పాడైపోయిన మొక్కలు బాల్కనీలో ఉంటే, వాటిని వెంటనే తొలగించడం చాలా అవసరం కూడా. బాల్కనీని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తులు సులభంగా ప్రవేశిస్తాయని వాస్తు చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+