అన్న హిట్ కొట్టేశాడ్రా!

Ramba Oorvasi Menaka Movie Review: అల్లరి నరేష్ హీరోగా.. చంద్రమోహన్ చింతడ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త ఫాంటసీ కామెడీ డ్రీమా 'రంభ ఊర్వశి మేనక'. రాశి సింగ్, ఫ్రిషా సింగ్, విష్ణుప్రియ టైటిల్ పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అవుట్ అండ్ అవుట్ వినోదాత్మకంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

Allu Arjun Raaka: అల్లు అర్జున్ 'రాకా' రిలీజ్ డేట్ ఫిక్స్..?
Allu Arjun Raaka: అల్లు అర్జున్ 'రాకా' రిలీజ్ డేట్ ఫిక్స్..?

స్టోరీ
మంతెన సూర్య నారాయణ(అల్లరి నరేష్) సరదాగా జీవితాన్ని గడిపే ఓ కుర్రాడు. ఓ మాయా పుస్తకం ద్వారా దేవకన్యలైన రంభ(రాశి సింగ్), ఊర్వశి(ప్రిషా సింగ్), మేనక(విష్ణుప్రియ)లను భూమిపైకి రప్పించి, తన కోరికలను తీర్చుకోవచ్చని భావిస్తాడు. అనూహ్య పరిస్థితుల్లో ఆ పుస్తకం తెరుచుకోవడంతో ఆ ముగ్గురు దేవకన్యలు సూర్య ముందు ప్రత్యక్షమవుతారు. అప్పటివరకు మూమూలుగా సాగిపోతున్న సూర్య జీవితంలోకి దేవకన్యలు వచ్చాక ఎలాంటి వినోదాత్మక పరిణామాలు చోటుచేసుకున్నాయి? వారు సూర్య సమస్యలను ఎలా తీర్చారు? అనేదే ఈ 'రంభ ఊర్వశి మేనక' సినిమా అసలు కథాంశం.

Ramba Oorvasi Menaka Movie Review Hero Allari Naresh Fantasy Comedy Delivers Fun Rating Details Here

విశ్లేషణ
అల్లరి నరేష్ తనకు మాత్రమే సాధ్యమైన కామెడీ టైమింగ్‌తో మరోసారి రక్తికట్టించారు. తన కామెడీ యాక్టింగ్‌తో సినిమా మొత్తాన్ని ముందుండి నడిపించారు. సీనియర్ నటుడు వీకే నరేష్‌తో కలిసి ఆయన చేసిన సీన్లు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా దేవకన్యలతో వీకే నరేష్ చెప్పే హిలేరియస్ డైలాగ్స్, మోనోలాగ్ సీన్లు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి. దేవకన్యలుగా నటించిన రాశి సింగ్, ప్రిషా సింగ్, విష్ణుప్రియ తమ అందంతో పాటు చక్కని అభినయంతో ఆకట్టుకున్నారు.దర్శకుడు వారిని దేవతామూర్తులుగా గౌరవప్రదంగా చూపిస్తూనే కామెడీ ట్రాక్‌ను నడిపిన తీరు ప్రశంసనీయం. ఇక ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించిన ప్రతిసారీ తనదైన మార్క్ నవ్వులు పంచగా.. శ్రీనివాసరెడ్డి కూడా తన కామెడీతో నెట్టుకొచ్చారు.

ఇంత మంచి కాన్సెప్ట్‌ను ఇలా చేశావేంటన్నా?
ఇంత మంచి కాన్సెప్ట్‌ను ఇలా చేశావేంటన్నా?

సాంకేతిక విభాగం
డైరెక్టర్ చంద్రమోహన్ చింతడ ఎంచుకున్న ఫాంటసీ కాన్సెప్ట్ ను నేటి కాలానికి తగ్గట్టుగా వినోదాత్మకంగా మలచడంలో విజయం సాధించారు. ఎలివేట్ అయ్యే ఫన్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. చైతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్ గా ఉండి ఫాంటసీ లుక్ ను బాగా తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్లు
*అల్లరి నరేష్ కామెడీ టైమింగ్
*సీనియర్ నటుడు వీకే నరేష్‌తో సీన్లు
*దేవకన్యలుగా రాశి సింగ్, ప్రిషా సింగ్, విష్ణుప్రియల యాక్టింగ్
*ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ కామెడీ

మైనస్ పాయింట్లు
*సినిమా కథ చాలా రొటీన్ కావడం
*ఎలాంటి ట్విస్టులు లేకపోవడం
*నిరాశపరిచే సెకండాఫ్
*నేటి తరానికి సరిపడే సహజమైన కామెడీ లేకపోవడం
*లాజిక్ లేని సన్నివేశాలు, సాగదీసిన కథనం

ఫైనల్‌గా..
పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి, అల్లరి నరేష్ మార్క్ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు 'రంభ ఊర్వశి మేనక' ఓ మంచి ఛాయిస్.

*రేటింగ్: 2.75/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+