దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన ప్రింట్!
రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్, మోస్ట్ అవైటెడ్ మూవీ 'దురంధర్-2' ఉగాది సందర్భంగా గురువారం రోజున థియేటర్లలో విడుదలైంది. రిలీజ్ అయిన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యం చిత్రబృందానికి బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలైన తొలిరోజే పైరసీ బారిన పడటమే కాకుండా సరిహద్దులు దాటి పాకిస్థాన్ కు చేరినట్లు వార్తలు రావడం మేకర్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. విడుదలైన తొలిరోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద భారీ విస్పోటనం సృష్టించిన ఈ సినిమాకు పైరసీ రూపంలో పెద్ద ముప్పు వచ్చి పడింది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది.
పాకిస్థాన్ చేరిన ప్రింట్
ఈ సినిమాపై పాకిస్థాన్ దేశంలో అధికారికంగా నిషేధం ఉంది. కానీ పాక్‌లో పైరసీ ప్రింట్ అప్పుడు వైరల్ అవుతోంది. లాహోర్ వంటి నగరాల్లో జర్నలిస్టులు కూడూ తమ ఇంట్లోనే టీవీల్లో ఈ సినిమాను పైరసీ వెబ్‌సైట్ల ద్వారా చూస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. పాకిస్థాన్‌లోని కొన్ని అండర్ గ్రౌండ్ మార్కెట్లలో ఈ సినిమా డీవీడీలు కూడా అందుబాటులోకి వచ్చాయని నెట్టింట ప్రచారం జరుగుతోంది. పాక్ ఉగ్రవాదాన్ని అణచివేసే కథతో వచ్చిన ఈ సినిమాపై ఆ దేశంలో నిషేధం కొనసాగుతోంది. పైరసీని పక్కన పెడితే ఇండియన్ సినిమాపై పాక్‌లో ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

పైరసీ సైట్లలో హెచ్‌డీ ప్రింట్.. తెలుగు ప్రేక్షకులకు షాక్
పైరసీ సైట్లలో హైక్వాలిటీ ప్రత్యక్షం కాగా.. పైరసీని ప్రోత్సహించవద్దని, అది నేరమని సినిమా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. భారీ బడ్జెట్‌తో, అదిరిపోయే గ్రాఫిక్స్‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని మొబైల్స్‌లో చూడవద్దని దర్శకుడు ఆదిత్య ధర్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఓ వైపు పైరసీ కలవరపెడుతుంటే.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనే అభిమానులకు నిరాశే ఎదురైంద. సాంకేతిక కారణాల వల్ల, డబ్బింగ్ పనుల్లో జాప్యం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా చోట్ల తెలుగు వెర్షన్ షోలు రద్దయ్యాయి. దీంతో అభిమానులు థియేటర్ల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications