మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు ఫ్యాన్స్ గెట్ రెడీ..!
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్' మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రిలీజ్ రోజు నుంచి దాదాపు 8 వారాల పాటు టికెట్ ముక్క దొరకలేదు అంటే ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొవిడ్-19 వేవ్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఎక్కువ మంది ఆదరించిన చిత్రంగా 'ధురంధర్' నిలిచింది. ఈ మూవీకి ప్రశంసలతోపాటు బాక్సాఫీస్ వద్ద దిమ్మతిరిగే కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ధురంధర్ మూవీ.
ఇక థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో దుమ్ము రేపేందుకు రెడీ అయింది. జనవరి 30 న ధురంధర్ మూవీ ఓటీటీలోకి రానుంది. జనవరి 30 అర్ధరాత్రి నుంచే ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది. దాంతో హిందీలో చూడలేకపోయిన తెలుగు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక ఈ చిత్రం అన్ కట్ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తోంది. థియేట్రికల్ వెర్షన్ కు రన్ టైమ్, సెన్సార్ కారణంగా తొలగించిన కొన్ని కీలక సన్నివేశాలు, డైలాగ్స్ ఈ వెర్షన్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇక ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య ధర్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. దాంతో ఈ మూవీ సీక్వెల్ పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. పార్ట్-2 ఎలా ఉండబోతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మార్చి 19 న ధురంధర్-2 విడుదల కానుంది. ఈ మూవీ విషయానికి వస్తే.. జస్కిరత్ సింగ్ రంగీ అనే పేరుతో పాకిస్థాన్ లో రహస్య ఏజెంట్ గా రణ్ వీర్ సింగ్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా నెగిటిల్ రోల్ రెహమాన్ డెకాయిట్ పాత్రతో ప్రశంసలు అందుకున్నారు. అలాగే సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు.












Click it and Unblock the Notifications