ధురంధర్-2 పై RGV రివ్యూ.. షోలే కంటే 100 రెట్లు గొప్పగా.. స్పీల్ బర్గ్, నోలన్ సైతం..
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. సినిమాతో పాటు సొసైటీలో ప్రస్తుతం జరుగుతున్న అనేక అంశాలపై ఆయన తనదైన శైలిలో సామాజిక మాధ్యమాల్లో ట్వీట్స్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ మూవీ ధురంధర్ -2 చూసిన ఆర్జీవీ.. ఈ మేరకు రివ్యూ ఇచ్చారు. ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ధురంధర్-2 మూవీ షోలే కంటే 100 రెట్లు గొప్పదని అని అన్నారు. ఈ మూవీ ముందు మొఘల్- ఏ- ఆజామ్.. వంటి క్లాసిక్ మూవీస్ కూడా టీవీ సీరియల్స్ లా కనిపిస్తాయని తెలిపారు. ఈ మూవీ సినీ ప్రపంచంలో కొత్త శకానికి నాంది అని పేర్కొన్నారు. ధురంధర్-2 మూవీపై ఆయన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వస్తున్న మూవీ 'ధురంధర్-2' గతేడాది రిలీజైన ధురంధర్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. ధురంధర్ మూవీ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. దాంతో ధురంధర్-2 రెండో భాగంపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు ముందుగా సెలబ్రిటీస్ కు ఈ మూవీని స్క్రీనింగ్ వేశారు. అయితే తాజాగా ఈ మూవీని చూసిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ మూవీ 'షోలే' కంటే 100 రెట్లు గొప్పదని అన్నారు. ఈ మూవీ ముందు 'మొఘల్- ఎ- ఆజమ్' వంటి క్లాసిక్స్ కూడా టీవీ సీరియల్స్ లా కనిపిస్తాయని తెలిపారు. సినిమా ప్రపంచంలో ఇది కొత్త శకానికి నాంది పలుకుతుందని ఆర్జీవీ స్పష్టం చేశారు. హాలీవుడ్ దిగ్గజాలు స్పీల్ బర్గ్, నోలన్ సైతం పనులు పక్కన పెట్టి ఈ సినిమా చూడాలని సలహా ఇచ్చారు.

ఈమేరకు డైరెక్టర్ ఆదిత్య ధర్ టాలెంట్ ను ఆకాశానికి ఎత్తారు. ఇకపై దర్శకుడు అన్న పదానికి స్పెల్లింగ్ ఆదిత్య ధర్ అనే పేరుతోనే స్టార్ట్ అవుతుందని తెలిపారు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక ధురంధర్-2 మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 19 న విడుదల కానుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. గంటకు 25 వేల టికెట్స్ సేల్ అవుతున్నాయి. తొలి భాగం కేవలం హిందీలోనే రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు రెండో భాగం హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ ఒకేసారి విడుదలకు సిద్ధం అవుతోంది.












Click it and Unblock the Notifications