మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వల్ల ఆ నిర్మాత అంత నష్టపోయాడా..?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల కాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. సంక్రాంతి సినిమాల విడుదల సమయంలో దిల్ రాజును కొందరు టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ముఖ్యంగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను నైజం ఏరియాలో దిల్ రాజును స్వయంగా విడుదల చేయడంతో .. హనుమాన్ సినిమాకు అనుకున్నంత స్థాయిలో థియెటర్లు దొరకలేదు. దీంతో కొన్ని మీడియా సంస్థలు దిల్ రాజుకు వ్యతిరేకంగా కొన్ని ప్రత్యేక కథనాలు వండి వడ్డించాయి.
తనపై వ్యతిరేకంగా కథనాలు రాసిన మీడియాకు దిల్ రాజు సైతం గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే గతంలో ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దిల్ రాజు మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ..నేను నిర్మాతగా నష్టపోయిన దాని కన్నా డిస్ట్రిబ్యూషన్ చేసి నష్టపోయిందే ఎక్కువ అని దిల్ రాజు వెల్లడించారు.

అది కూడా తెలుగులో ఇద్దరు టాప్ హీరోల సినిమాలే అని ఆయన తెలిపారు. అందులో ఒకటి మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన స్పైడర్ , మరొకటి పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన అజ్ఞాతవాసి అని దిల్ రాజు పేర్కొన్నారు. స్పైడర్ సినిమా వల్ల 12 కోట్లు ఆ రోజుల్లోనే నష్టపోయానని ..అజ్ఞాతవాసి వల్ల 13 కోట్లు నష్టపోయానని..ఈ రెండు సినిమాల వల్ల 25 కోట్లు నష్టపోయినట్టుగా ఆయన ఈ ఇంటర్య్వూలో తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications