ఆ డైరెక్టర్ ఈసారి సంక్రాంతికి చిరుతో రాబోతున్నారా.. ?
తెలుగు చిత్ర పరిశ్రమలోని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా పేరొందారు అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. అయితే అంతకు ముందు ఎన్నో చిత్రాలకు రైటర్‌గా పని చేశాడు. ఇక ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఘోస్ట్ రైటర్‌గానూ పని చేశాడు. తాను చేసిన పనికి గుర్తింపు ఇవ్వలేదు కాబట్టే.. తాను దర్శకుడిగా మారానని చెబుతుంటాడు అనిల్ రావిపూడి. ఒక వేళ తనకు అప్పుడే క్రెడిట్స్ ఇచ్చి ఉంటే తాను కూడా ఓ రైటర్ మాదిరిగానే సెటిల్ అయిపోయే వాడిని అని అంటుంటాడు.
ఇక రీసెంట్ గానే సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ హిట్ అందుకుంది. ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో మళ్లీ సంక్రాంతికి సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం అనే పేరుతో సినిమా చేస్తామని కూడా ప్రకటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం పొంగల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు.

అయితే ఈసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. దాంతో వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ తో.. అనిల్ రావిపూడి చిత్రం రావడం పక్కా అని మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి సైతం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఆ స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత మే, జూన్ నెలలో నుంచి సినిమా పట్టాలెక్కించి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు ఆ సినిమా నిర్మాత సాహు గారపాటి పేర్కొన్నారు.
వింటేజ్ చిరంజీవిని తీసుకురావడమే లక్ష్యంగా అనిల్ రావిపూడి అండ్ టీం పని చేస్తుందని సాహు గారపాటి పేర్కొన్నారు. అనిల్ రావిపూడి మార్కుతో చిరంజీవి సినిమా నుంచి ప్రేక్షకులు ఏమేం కోరుకుంటారో అన్నీ ఉండేలా కథ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీ 2025 సమ్మర్‌లో విడుదల కానుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమానే ప్రారంభం అవుతుందని సమాచారం.












Click it and Unblock the Notifications