'చిరు'నవ్వుల పండగబొమ్మకి సిద్దం.. 'శంకర్ వరప్రసాద్'రాబోతున్నాడు..!
మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో కామెడీ ఎంటర్ టైనర్ రూపొందనుంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్న తరుణంలో మెగా అభిమానులకు డైరెక్టర్ అనిల్ రావిపూడి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఈ మేరకు ఆ పోస్టులో ఫైనల్ స్క్రిప్టు వినిపించడం పూర్తయింది. చిరంజీవికి నా కథలో పాత్ర 'శంకర్ వరప్రసాద్'ని పరిచయం చేశా.. ఆయనకు ఆ రోల్ బాగా నచ్చింది. ఇంకెందుకు లేటు .. త్వరలో ముహూర్తంతో.. 'చిరు'నవ్వుల పండగబొమ్మకి శ్రీకారం అని రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ ఫుల్ వైరల్ గా మారింది. చాలా కాలం తర్వాత చిరంజీవి చేస్తున్న పూర్తిస్థాయి కామెడీ మూవీ కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మెగాస్టార్ అసలు పేరు శివ శంకర వరప్రసాద్ అని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే 155 సినిమాల్లో నటించిన చిరంజీవి.. పలు ప్రాజెక్టులను అనౌన్స్ కూడా చేశారు. కానీ చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే ఆయన శంకర్ పేరుతో కనిపించారు. లంకేశ్వరుడు సినిమాలో శివ శంకర్‌గా.. ఇంద్ర మూవీలో శంకర్ నారాయణగా, శంకర్ దాదా - ఎంబీబీఎస్, శంకర్ దాదా - జిందాబాద్ చిత్రాల్లో శంకర్ ప్రసాద్‌గా నటించారు. ఇక ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో శంకర వరప్రసాద్ గా కనిపించబోతుండడం పట్ల మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఉగాది సందర్బంగా ఈ నెల 30వ తేదీన పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించనున్నట్టు సమాచారం. రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారట. ఆయన గత చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అనిల్ రావిపూడి.
Final script narration done & locked 📝☑️🔒
— Anil Ravipudi (@AnilRavipudi) March 26, 2025
చిరంజీవి గారికి నా కధ లో పాత్ర
“శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను .. 😄
He loved & enjoyed it thoroughly ❤️🔥
ఇంకెందుకు లేటు,
త్వరలో ముహూర్తంతో…
‘చిరు’ నవ్వుల పండగబొమ్మ కి శ్రీకారం 🥳#ChiruAnil
MegaStar @KChiruTweets garu…
ఇక మెగాస్టార్ ప్రస్తుతం బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు. ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు ఆడియన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.












Click it and Unblock the Notifications