'స్పిరిట్' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పూరీ జగన్నాథ్?
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సినిమా చేయాలని స్టార్ హీరోలంతా ఎదురుచూస్తుండేవారు. ఎంతోమంది హీరోలకు బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు. బ్యాంకాక్ వెళ్లి తొందరగా కథను రాసుకోవడం, అంతే తొందరగా సినిమా షూటింగ్ ను పూర్తిచేస్తారు. అంత తక్కువ రోజుల్లో సినిమాను ఎలా పూర్తిచేస్తారో తనకు కూడా చెప్పమని దర్శకుడు రాజమౌళి పూరీని అడిగారు. నీ కథలు చాలా బాగుంటాయి.. ఒక్కసారి షూటింగ్ కు వెళ్లేముందుకు నాకు చూపిస్తే అందులో ఏమైనా లోపాలున్నాయేమో సరిచేస్తాను.. ఎందుకంటే నేను నీ ఫ్యాన్ ను అని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ ఎన్నోసార్లు పూరీని అడిగేవారు.
10 సినిమాల్లో కేవలం రెండే హిట్
అటువంటి డైరెక్టర్ తాను చేసిన చివరి 10 సినిమాల్లో కేవలం టెంపర్, ఇస్మార్ట్ శంకర్ మాత్రమే హిట్ అయ్యాయి. దీన్నిబట్టి అతని విజయాల శాతం ఎలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. లైగర్ సినిమా తర్వాత పూర్తిగా డౌన్ అయ్యాడు. డబుల్ ఇస్మార్ అడ్రస్ లేదు. చిన్న చిన్న హీరోలు కూడా పూరీతో సినిమా చేయడానికి ముందుకు రావడంలేదు. ఎవరూ కథ వినడానికి కూడా ఆసక్తి చూపించడంలేదు. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న చిత్రం స్పిరిట్. దీన్ని రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నారని తెలుగు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.

సినిమాకు మాటలు రాస్తున్నారు
అసిస్టెంట్ డైరెక్టర్ అంటే మాటల రచయితగా స్పిరిట్ సినిమాకు చేస్తారని చెబుతున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో పోలీసు అధికారిగా కనిపిస్తారు. సందీప్ రెడ్డి వంగా స్క్రీన్ ప్లేకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఈ ఏడాది చివరకు షూటింగ్ ప్రారంభం కాబోతోంది. తన సినిమాకు సంబంధించి డైలాగుల బాధ్యతను పూరీకి అప్పగించినట్లు సమాచారం. సందీప్ కు, పూరీకి మంచి స్నేహం ఉండటంవల్ల ఇది సాధ్యమవుతోంది. అయితే పూరీ జగన్నాథ్ రేంజ్ వేరు.. సందీప్ రెడ్డి రేంజ్ వేరు.. ఇదే ప్రభాస్ తో పూరీ గతంలో ఏక్ నిరంజన్, బుజ్జిగాడు సినిమాలు తీశారు. ఇప్పుడు అదే ప్రభాస్ సినిమాకు మాటల రచయితగా పనిచేయాల్సి వస్తోంది. సందీప్ కోసం రాస్తే పర్వాలేదని, కానీ ఆదాయం అనేది మనిషికి ఉండాలి కాబట్టి డైలాగులు రాస్తున్నారంటున్నారు.












Click it and Unblock the Notifications