Ram Gopal Varma, Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్..!
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు సినిమాల కంటే రాజకీయాలు, ఇతర విషయాలపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే రాజకీయనాయకులు, సెలబ్రిటీలపై వర్మ వివాదాస్పంద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆర్జీవీ ఎక్స్ లో ఓ ట్వీట్ చేశాడు. "నా ప్రియమైన స్నేహితుడు, ఫైర్ క్రాకర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కలిశాను" అంటూ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు.
ఈ పోస్ట్ కు నెటిజన్లు స్పందించారు. రేవంత్ రెడ్డి బయోపిక్ ఏమైన తీస్తున్నారా అంటూ కామెంట్లు చేశారు. శుక్రవారం దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మే 19వ తేదీన నిర్వహించబోతున్న డైరెక్టర్స్ డే కు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. రామ్ గోపాల్ వర్మ ఏపీలో వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడం.. నా ప్రియమైన మిత్రుడు అనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

చాలా మంది చర్చించుకుంటున్న విషయం ఏమిటంటే.. సాధారణంగా రామ్ గోపాల్ వర్మ ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్వహించే ఏ కార్యక్రమాలకు సరిగా హాజరుకాడు. శుక్రవారం యువ దర్శకులతో కలిసి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించడం పలు చర్చలకు దారి తీస్తుంది.
Visited my dear friend and FIRECRACKER @revanth_anumula the HONOURABLE CHIEF MINISTER of TELANGANA 🔥🔥🔥 pic.twitter.com/sY2cQQ5ukJ
— Ram Gopal Varma (@RGVzoomin) May 18, 2024
ప్రతీ యేట దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టిన రోజు సందర్భంగా మే 4న డైరెక్టర్స్ డే జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిపేందుకు డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం మే 4 కాకుండా మే 19న డైరెక్టర్స్ డే జరుపాలని నిర్ణయించారు. దీంతో ఆదివారం రోజు డైరెక్టర్స్ డే నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications