ఉత్తరాంధ్ర ప్రజల కోసం రామ్ చరణ్ కొత్త ప్రయత్నం
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ప్రస్తుతం తన తండ్రినే మించిపోయిన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఒక్కో సినిమాతో తనని తాను మార్చుకుంటూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అనంతరం RRR చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తూ మరోవైపు సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.
ఈ సినిమా కోసం బుచ్చిబాబు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. నటనపై ఆసక్తి ఉన్నవారు తాను రామ్ చరణ్ తో రూపొందించబోయే RC16లో నటించవచ్చన్నారు. ఈ సినిమా కథ ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలకు చెందినవారే సినిమాలో నటిస్తే సహజంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. తమ టీమ్ మొత్తం అక్కడే ఉందని, ఆడిషన్స్ జరుగుతున్నాయని, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా యాక్టింగ్ చేయాలనుకునేవారు ఆడిషన్స్ కు రావాలంటూ బుచ్చిబాబు ఒక వీడియోను విడుదల చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, జీడిమెట్ల, బొబ్బిలి ప్రాంతాల్లో ఎవరైనా సరే వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

ఉత్తరాంధ్ర నేటివిటీతో తీస్తున్న రామ్ చరణ్ కొత్త సినిమాలో యాక్టింగ్ చేయడానికి ఆసక్తి ఉన్నవారు ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు - దర్శకుడు బుచ్చిబాబు #RamCharan #BuchiBabuSana #RC16 #Oneindiatelugu pic.twitter.com/eS86EVctU9
— oneindiatelugu (@oneindiatelugu) February 7, 2024
ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు ఆడిషన్స్ జరుగుతాయి. ఇందులో పాల్గొని తమ టాలెంట్ ను బయటపెట్టాలని దర్శకుడు సూచించారు. తద్వారా రామ్ చరణ్ తో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వీడియోలో బుచ్చిబాబు వెనకాల ఉన్న రామ్ చరణ్ ఫొటో అందరినీ ఆకర్షించింది.












Click it and Unblock the Notifications