సందీప్ రెడ్డి వంగా అడుగు పెడుతున్నాడంటే ఏదో ఉంది..!

స్నేహం, సరదా పంచ్‌లు, చిన్న చిన్న గొడవలతో సాగే కథలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరణ చూపిస్తారు. అలాంటి నేపథ్యంలోనే మరో కొత్త చిత్రం 'జిగ్రీస్' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు.

తాజాగా, ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి కూడా సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆగస్టు 8న రాత్రి 8 గంటలకు ఎల్.బి. నగర్‌లోని అర్బన్ మాయా బజార్‌లో ఈ టీజర్ విడుదల కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ యూత్‌ను బాగా ఆకట్టుకుంది.

Director Sandeep Reddy Vanga to release teaser of Jigris

పాతకాలపు మారుతి 800 కారు పక్కన నలుగురు స్నేహితులు నిలబడ్డ విజువల్స్ నోస్టాల్జియాను గుర్తు చేశాయి. చిన్ననాటి స్నేహితులు, క్రేజీ అడ్వెంచర్స్, రోడ్ ట్రిప్‌ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ యువతను మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది. సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖ దర్శకుడు ఈ సినిమాకు మద్దతు ఇవ్వడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+