పుష్ప2 షూటింగ్‌లో కుర్చీని కాలితో తన్ని బయటకు వెళ్లిపోయిన సుకుమార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్నారు. రష్మిక కథానాయిక. పుష్ప మొదటి భాగం తెలుగులోకన్నా ఎక్కువగా హిందీలో హిట్ అవడంతో రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. వాస్తవానికి ఆగస్టు 15వ తేదీన సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో డిసెంబరు ఆరోతేదీకి వాయిదా పడింది.
మళ్లీ షూటింగ్ అంటే భారీగా ఖర్చు
ఈ సినిమా షూటింగ్ పూర్తికాకపోవడం, కొన్ని సన్నివేశాలు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో దర్శకుడు సుకుమార్ తిరిగి చిత్రీకరిస్తున్నారు. దీనికి బడ్జెట్ అనుకున్నదానికన్నా ఎక్కువ అవుతోంది. ఇప్పటికే సినిమా విడుదల వాయిదా పడటంతో నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలుగు నెలలు వడ్డీ ఖర్చు పెరుగుతుందని, తిరిగి మళ్లీ సన్నివేశాలు తీయాలంటే బడ్జెట్ భారీగా అవుతుండటంతో ఉన్నదాంతోనే సరిపెట్టుకొని, తక్కువ ఖర్చులో ఎక్కువ నాణ్యత వచ్చేలా తీయాలంటూ నిర్మాతలు సుకుమార్ కు తేల్చిచెప్పారు.

డిసెంబరుకైనా పూర్తవుతుందా?
అయితే షూటింగ్ బడ్జెట్ ను నిర్మాతలు కేటాయించకపోవడం, మరోవైపు కొన్ని సన్నివేశాల్లో నటులు ఎంత చెబుతున్నప్పటికీ తాను అనుకునే రీతిలో నటించకపోవడంతో ఎక్కువ టేకులు అవసరపడుతున్నాయి. దీంతో సుకుమార్ కూడా తీవ్ర అసహనానికి లోనై కుర్చీని కాలితో తన్ని షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తెలుగు ఫిల్మ్ నగర్ లో ప్రస్తుతం ఈ వార్త చక్కర్లు కొడుతోంది. సన్నివేశాలు చాలా పెద్దవని, వాటిని తీయాలంటే నటీనటుల కాల్షీట్లకు డబ్బులు చెల్లించడంతోపాటు చిత్రీకరణకు కూడా భారీ స్థాయిలో ఖర్చవుతోందని తెలుస్తోంది. మరి డిసెంబరుకన్నా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందో లేదో సుకుమార్ కే తెలియాలి.












Click it and Unblock the Notifications