సెంట్రల్ జైల్లో హీరో దర్శన్, స్టార్ హీరో సుదీప్ ఏం చెప్పారో తెలుసా, బర్త్ డే రోజు

ఓ సినిమా హీరో పుట్టిన రోజు సందర్భంగా వేలాది మంది అభిమానులు పోటెత్తి ఆ హీరో ఇంటి దగ్గరకు వస్తారు. ప్రతి సంవత్సరం ఎక్కువ మంది అభిమానులు గుమిగూడుతారు, ఇలా అభిమానులు తమ ప్రేమను అభిమాన హీరో ముందు ప్రదర్శిస్తారు. కన్నడ స్టార్ హీరో, బహుబాష నటుడు, నిర్మాత, దర్శకుడు కిచ్చా సుదీక్ కు కర్ణాటకలో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.

గత ఏడాది సుమారు 304 వేలకు పైగా అభిమానులు బెంగళూరులోని ఆయన ఇంటి ముందు గుమికూడటంతో స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సంవత్సరం పోలీసులు, మా ఇంటి ఇరుగుపొరుగు వారు ఒక అభ్యర్థన చేసారు. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు. నా వల్ల ఇతరులు బాధపడటం నాకు ఇష్టం లేదు, అందుకని ఇతర ఊర్ల నుంచి స్నేహితులు, తన అభిమానులు బెంగళూరులోని తన ఇంటికి రాకూడదని హీరో సుదీప్ మనవి చేశారు.

Do you know what star hero Sudeep said about actor Darshan who is in jail

బెంగళూరులో శనివారం మీడియాతో మాట్లాడిన హీరో సుదీప్ ఆయన అభిమానులకు ఓ మనవి చేశారు. మీరు అక్కడవుంటే అక్కడి నుంచి తనను ఆశీర్వదించాలని హీరో సుదీప్ ఆయన అభిమానులకు మనవి చేశారు.

హీరో దర్శన్ బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి
బళ్లారి జైలుకు వెళ్లిన తరువాత హీరో సుదీప్ మీడియా సమావేశం ఏర్పాటు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. హీరో సుదీప్ ఏం మాట్లాడుతారు అంటూ కన్నడ మీడియా కూడా ఆసక్తిగా ఎదురు చూసింది.

చివరికి శనివారం హీరో కిచ్చా సుదీప్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈసారి నా పుట్టిన రోజు నాడు అభిమానులు ప్రశాంతంగా ఉండాలని సుదీప్ మవని చేశారు. బెంగళూరులోని ఎంఈఎస్ గ్రౌండ లో పుట్టిన రోజు వేడుకలకు ఎమ్మెల్యే ఏర్పాట్లు చేశారని సుదీప్ చెప్పారు. బెంగళూరులోని జయనగర్‌లోని టెలిఫోన్‌ ఎక్స్ఛేంజీ కార్యాలయం సమీపంలోని ఎంఈఎస్‌ గ్రౌండ్‌లో తన పుట్టిన రోజు వేడుకులకు పోలీసులు అనుమతి ఇచ్చారని సుదీప్ అన్నారు.

సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోలీసులు మాకు తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహఇంచడానికి సమయం కేటాయించారని హీరో సుదీప్ అన్నారు. జయనగర్‌లో నా అభిమానులను తాను కలుస్తానని, దయచేసి ఇంటి దగ్గరకు రావద్దని, అభిమానులు అందరూ జయనగరలోని గ్రౌండ్ దగ్గరకు రావాలని అభిమానులను హీరో సుదీప్ అభ్యర్థించారు.

కన్నడ హీరో దర్శన్ గురించి చెప్పాలని కన్నడ మీడియా హీరో సుదీప్ ను అడిగింది. హీరో దర్శన్ కు ఒక కుటుంబం ఉందని, ఒకే విషయాన్ని పదేపదే అడుగుతూ విసుగు వచ్చేలా చెయ్యకూడదని, మనం ఇక్కడ రాజకీయంగా మాట్లాడుతున్నట్లు ఉండకూడదని, మనం చట్టాన్ని, ప్రభుత్వాన్ని విశ్వసించాలని హీరో సుదీప్ అన్నారు. చట్టాన్ని గౌరవించాలని హీరో సుదీప్ అన్నారు. నేను చట్టాన్ని నమ్ముతానని, చట్టం ఏం చెబితే అదే జరుగుతుందని హీరో సుదీప్ అన్నారు. దర్శన్ నేరం చేసినట్లు ఇంకా రుజుకుకాలేదని, ఆ విషయం కోర్టులో ఉంది కాబట్టి తాను ఆ విషయం గురించి ఎక్కువ మాట్లాడనని, ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని హీరో సుదీప్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+