Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిగ్ షాక్: ఆస్కార్ అవార్డులు రద్దు?

Oscars 2025: దావానలం బారిన పడిన అమెరికాలోని లాస్ ఏంజిలిస్ రోజురోజుకూ దహించుకుపోతోంది. నగరాన్ని కార్చిచ్చు కమ్మేసింది. ఇప్పటివరకు 25 మంది సజీవదహనం అయ్యారు. మంటలు ఇంకా వ్యాప్తి చెందుతోండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

వారం రోజులుగా మంటలు చెలరేగుతూనే ఉంటోన్నాయక్కడ. కిందటి మంగళవారం నాడు ఈ మంటలు అంటుకోగా.. ఈ రోజుకూ లాస్ ఏంజిలిస్ మండుతూనే ఉంది. అగ్నికీలలు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఎనిమిది రోజులుగా మంటల్లో తగుబడుతూనే వస్తోందా మోస్ట్ ఎంటర్‌టైన్మెంట్ సిటీ.

Fact-check Will the Oscars 2025 to get cancelled due to Los Angeles wildfire 2025

ఇప్పటివరకు 48,500 హెక్టార్ల మేర అడవులు అగ్నికి దహించుకుపోయాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల అటు వాతావరణంలోనూ పెను మార్పులు చోటు చేసుకుంటోన్నాయి. అమెరికా సగటు 1.5 రెండు డిగ్రీల మేర పెరిగిందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా భారీగా ఆస్తినష్టం సంభవించిందిక్కడ. అనేక ప్రాంతాలు బుగ్గిపాలు అయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. హాలీవుడ్‌ ఇప్పటికే అగ్నికి అహూతి అయింది. పలువురు స్టార్ హీరోలు, దర్శకులు, టెక్నీషియన్ల నివాసాలు బూడిదకుప్పలయయాయి. యుద్ధ ప్రాతిపదికన తరలింపు చర్యలు చేపట్టింది. లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసింది.

హాలీవుడ్ స్టార్ హీరో మెల్ గిబ్సన్, ఆంటోనీ హాప్‌కిన్స్ నివాసాలు పూర్తిగా దగ్ధమైంది. బూడిదకుప్పలా మారాయి. బిల్లీ క్రిస్టల్, జెనికా, జెఫ్ బ్రిడ్జెస్, పారిస్ హిల్టన్, క్యారీ ఎల్విస్, మార్క్ హామిల్, మ్యాండీ మూర్, జేమ్స్ వుడ్, మిలో వెంటిమిగ్లియా, ఆడమ్ బ్రాడీ, జాన్‌ గుడ్‌మ్యాన్, అన్నా ఫేరిస్.. నటులు తమ ఇళ్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

ఈ పరిస్థితుల మధ్య ఈ ఏడాది జరగాల్సిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం రద్దవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 96 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఈ ఏడాది ఈ కార్యక్రమం ఉండకపోవచ్చంటూ వార్తలు వెలువడుతున్నాయి. లాస్ ఏంజిలిస్, కాలిఫోర్నియా, హాలీవుడ్ మొత్తం కూడా మంటల బారిన పడటం దీనికి కారణమంటూ చెబుతున్నారు.

లాస్ ఏంజిలిస్‌లోని డాల్బీ థియేటర్‌లోనే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటవుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా వైల్డ్ ఫైర్ బారిన పడటం వల్ల రద్దు కావడమో లేక వాయిదా పడటమో జరుగొచ్చని ప్రచారం జరుగుతోంది.

దీన్ని ఆస్కార్ అవార్డుల కమిటీ కొట్టివేసింది. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తెలిపింది. యధాతథంగా అంటే మార్చి 2వ తేదీన అవార్డుల ప్రదానోత్సం జరుగుతుందని పేర్కొంది. టామ్ హాంక్స్, మెరిల్ స్ట్రిప్, ఎమ్మా స్టోన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి స్టార్లతో కూడిన టీమ్.. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తోందని తెలిపింది.

55 మందితో కూడిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్.. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలను పర్యవేక్షిస్తోందంటూ ఆస్కార్ అకాడమీ అధ్యక్షుడు జనెట్ యాంగ్, సీఈఓ బిల్ క్రామెర్ తెలిపారు. లాస్ ఏంజిలిస్ కార్చిచ్చు పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆస్కార్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌లో నలుగురు సభ్యులు సైతం తమ నివాసాలను కోల్పోయారని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+