అల్లు అర్జున్ అంటే పిచ్చి.. ఆ సీన్స్ కూడా ఒకే అంటున్న ప్రముఖ హీరోయిన్
టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇక లేటెస్ట్ గా వచ్చిన పుష్ప 2 తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో ఇండియాలోనే హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్నీ అంటే తనకు పిచ్చి అని.. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్న అంటూ మనసులో మాటను బయటపెట్టింది.
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ప్రముఖ నటి ప్రియా భవాని శంకర్. మొదట న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇక 2017లో మేయా దమాన్ అనే తమిళ సినిమా ద్వారా నటిగా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తనదైన శైలిలో తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈమె.. తెలుగులోనూ మంచి ఛాన్స్ లు సంపాదించుకుంటుంది.

కళ్యాణం కమనీయం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది తొలి సినిమాతోనే ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత గోపీచంద్ తో 'భీమా', సత్యదేవ్ సరసన 'జీబ్రా' సినిమాల్లో నటించింది. అలానే డబ్బింగ్ సినిమాలు ఇండియన్ 2, డిమోంటీ కాలనీ 2, బ్లాక్ తో కూడా మంచి గుర్తింపు సంపాదించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. బన్నీ అంటే తనకు పిచ్చి అని.. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్న అంటూ మనసులో మాటను బయటపెట్టింది.
ఇన్నాళ్లు గ్లామర్ షో కు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఆయనతో రొమాంటిక్ సీన్ లోనైనా పర్వాలేదు నటించేస్తా అని తెలిపింది. దీంతో ప్రియ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న ఈమె.. తెలుగులో కూడా మంచి ఛాన్స్ లు దక్కించుకోవాలని ఆమే అభిమానులు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications