విరాళమివ్వడానికి మనసు రాని స్టార్ హీరోలు?

ఏపీ, తెలంగాణను వరదలు ముంచెత్తాయి. ఎంతోమంది బాధితులు నిరాశ్రయులయ్యారు. వారికి ఆహారం అందించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికపైన పనిచేస్తున్నాయి. ఏపీలో ప్రధానంగా గుంటూరు, విజయవాడ నగరాల్లో గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. విజయవాడ నగరంలోని సింగ్ నగర్, మిల్క్ ప్రాజెక్ట్, జక్కంపూడి కాలనీ తదితర ప్రాంతాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. నిరాశ్రయులకు ఆహారం అందించేందుకు అక్షయపాత్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది.

ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచినరీతిలో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల చొప్పున, బాలకృష్ణ కూడా రెండు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల చొప్పున, వైజయంతీ మూవీస్ ఏపీకి రూ.25 లక్షలు, విశ్వక్ సేన్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షల చొప్పున.. ఇలా ప్రకటించుకుంటూ వచ్చారు. అయితే సినీ పరిశ్రమలో పలువురు స్టార్ హీరోలు ఇంతవరకు స్పందించడంలేదంటూ విమర్శలు వస్తున్నాయి.

Few star heroes in Telugu have not announced donation yet

కేరళలో వయనాడ్ ను వరదలు ముంచెత్తితే చిరంజీవి, రామ్ చరణ్ చెరో కోటిరూపాయల చొప్పున అందజేశారు. ఇంతవరకు వారు స్పందించలేదు. అలాగే కేరళకు రూ.25 లక్షలు ఇచ్చిన అల్లు అర్జున్, రూ.2 కోట్లు ఇచ్చిన ప్రభాస్, సూర్య, జ్యోతిక, నయనతార, రష్మిక, ఫాహద్ ఫాజిల్ లాంటివారు ఇంతవరకు తెలుగు రాష్ట్రాలకు తమవంతుగా ఇంతవరకు స్పందించలేదు. అలాగే అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్, రానా, సురేష్ బాబు, నాని, నాగచైతన్య, రవితేజ లాంటి స్టార్ హీరోలెవరూ స్పందించలేదు. వారంతా విరాళాలిచ్చి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకోవాలని వారి అభిమానులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+