Jayaprada: లొంగిపోయిన జయప్రద.. ఇక జైలు జీవితమేనా..!
బీజేపీ మాజీ ఎంపీ, సినీ జయప్రద కోర్టులో లొంగిపోయారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో ఆమె ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. దీంతో పోలీసులు ఆమె కేసు నమోదు చేశారు. జయప్రదపై రాంపూర్ లో రెండు కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి కోర్టు జయప్రదకు చాలాసార్లు నోటీసులిచ్చింది.
అయినప్పటికీ ఆమె విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాంపూర్ కోర్టు జయప్రదపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి జయప్రద తప్పించుకుని తిరుగుతున్నారు. జయప్రదపై కోర్టు ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 27న నటి జయప్రద పరారీలో ఉన్నట్ ఈ మేరకు రాంపూర్ కోర్టులు ప్రకటించింది.

ఆమెపై సీఆర్పీసీ 82 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటూ, ఒక డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆరో తేదీలోగా జయప్రదను కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ పోలీసులను ఆదేశించింది. దీంతో జయప్రద సోమవారం కోర్టులో లొంగిపోయారు. 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా జయప్రద చిత్రసీమకు పరిచమయ్యారు. అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషల్లో కొనసాగింది.
జయప్రద తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలి భాషాల్లో 300లకు పైగా సినిమాల్లో నటించారు. ఈమె 1986 జూన్ 22న సినీనిర్మాత శ్రీకాంత్ నహతాను పెళ్లి చేసుకున్నారు. 1994 అక్టోబర్ 10 న తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయరంగ ప్రవేశము చేశారు. 1996 ఏప్రిల్ లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. జయప్రద ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదముతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గము నుంచి 2004 మే 13న లోక్ సభకు ఎన్నికైయ్యారు. ఎస్పీకి కూడా రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications