మహేష్‌బాబుకు వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ రాజకీయ నేత?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎంతోమంది దర్శకులు తమ చిత్రాలకు అనుగుణంగా స్టైల్ మార్చాలని, కథకు అనుగుణంగా మేకోవర్ అవ్వాలని కోరినప్పటికీ సిద్ధపడని మహేష్ బాబు ఇప్పుడు మాత్రం రాజమౌళి సినిమా కోసం గుబురుగా గడ్డం పెంచుతున్నాడు. దీనికోసం ముందుగానే జర్మనీలో శిక్షణ తీసుకున్నాడు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో డాక్టర్ కెఎల్ నారాయణ, గోపాల్ రెడ్డి దీన్ని నిర్మిస్తున్నారు.

కృష్ణ చెప్పారంటే సరైందే
మొదటినుంచి మహేష్ బాబు ఏ సినిమా చేసినా అది ఆడుతుందా? లేదా? అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేది సూపర్ స్టార్ కృష్ణ ఒక్కరే. ఆయన సరిగ్గా అంచనా వేస్తారు. ఆయన చెప్పిన ప్రకారమే జరుగుతాయి. తన తండ్రి కృష్ణ చెప్పిన అంచనా ఎప్పుడూ తప్పలేదని మహేష్ ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూల్లో తెలిపాడు. అలాగే మహేష్ బాబు సినిమాల గురించి జడ్జిమెంట్ ఇచ్చే మరోముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ఆయన కచ్చితంగా మహేష్ బాబు ప్రతి సినిమా చూస్తారు. బాగుందా? లేదా? అని మహేష్ బాబుకు చెబుతారు. ఎందుకంటే ఆయన ప్రిన్స్ కు స్నేహితుడు కూడా. ఆయనెవరో కాదు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్.

Former Telangana minister KTR gives his judgment on Mahesh Babu s movies from time to time

కేటీఆర్ ఫోన్ చేసి వార్నింగ్
సినిమా బాగుందా? లేదా? అని నిర్మొహమాటంగా చెబుతుంటారని, సినిమా విడుదలైన తర్వాత కేటీఆర్ ఏం చెబుతారా? అని తాను టెన్షన్ పడుతుంటానన్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు ఆగడు సినిమా చేశాడు. ఈ సినిమా చూసిన వెంటనే కేటీఆర్ ఫోన్ చేసి ఇలాంటి చెత్త సినిమాలు ఎప్పుడూ చేయమాకు.. చేస్తే బాగోదు.. జాగ్రత్త.. మరోసారి చెబుతున్నాను.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. అలా కేటీఆర్ తనకు వార్నింగ్ ఇచ్చారని మహేష్ బాబు చెప్పారు. భరత్ అనే నేను సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవుతోంది. మహేష్ బాబు కెరీర్ లోనే బ్రహ్మోత్సవం తర్వాత చెత్త డిజాస్టర్ గా ఆగడు సినిమా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+