సంక్రాంతికి వస్తున్నాం'.. ఓటీటీ రిలీజ్ డేట్ పై బిగ్ ట్విస్ట్..
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసింది.ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకుపైగా వసూలు చేసి రీజినల్ సినిమాల్లో ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. వెంకీ మామ కెరీర్ లోనూ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా ఈ మూవీ అరుదైన రికార్డు సాధించింది. ఈ మూవీ జనవరి 14న రిలీజ్ కాగా ఇప్పటికీ థియేటర్లకు జనాలు క్యూ కడుతున్నారు. మరోవైపు ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా..? అని చూసేందుకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ జీ 5 హక్కులు పొందింది.
అయితే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ 5 ఈ మూవీ రిలీజ్ పై ట్విస్ట్ ఇచ్చింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఓ ఆసక్తికర పోస్టు పెట్టింది."మళ్లీ సంక్రాంతి వైబ్స్ కు సిద్ధంగా ఉండండి. అని చెప్తూ.. సినిమాను ఓటీటీ కంటే ముందే టీవీలో రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. మొదట ఫిబ్రవరి రెండో వారంలోనే ఈ మూవీ ఓటీటీలోకి రావాల్సి ఉన్నప్పటికీ.. ప్రేక్షకులు థియేటర్లలో చూసేందుకే మొగ్గు చూపిస్తున్న క్రమంలో ఓటీటీ తేదీని వాయిదా వేశారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇంటిల్లిపాదీ చూసే సినిమా. అందుకే మొదట టీవీలో ప్రదర్శిస్తే టీఆర్ పీ రేటింగ్ పెరుగుతుందని జీ 5 యాజమాన్యం భావిస్తోంది.













Click it and Unblock the Notifications