భారత్‌పై గెలిచి చీటీ చూపించిన పాక్ క్రికెటర్.. అసలేం రాశాడంటే!
అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా ఆదివారం ఒమన్‌లోని అల్ అమెరాట్ క్రికెట్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన రసవత్తర పోరులో పాక్ 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ ఉత్కంఠభరిత పోరులో పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ హంజా జహూర్ బాధ్యతాయుతమైన అద్భుత సెంచరీతో(100 నాటౌట్) జట్టును గెలిపించాడు. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే ఆయన జరిపిన ఓ వినూత్న వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
జేబులోంచి బయటకు తీసిన పేపర్ సీక్రెట్!
పాకిస్తాన్ విజయానికి కావాల్సిన పరుగులను బౌండరీతో పూర్తి చేసి సెంచరీని చేరుకోవడమే కాకుండా ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు హంజా జహూర్. గెలుపు సంబరాల్లో భాగంగా బౌండరీ వైపు పరిగెత్తుకెళ్లిన ఆయన, తన జేబులో దాచుకున్న ఓ కాగితపు ముక్కను బయటకు తీసి కెమెరాల వైపు చూపించాడు. ఆ పేపర్‌పై 'రేపటి మ్యాచ్, 50 ఇన్షా అల్లాహ్.. హంజా జహూర్.. ఐ యామ్ ది బెస్ట్' అని రాసి ఉంది. స్టేడియంలోకి అడుగుపెట్టడానికి ముందే తాను ఈ మ్యాచ్‌లో గొప్ప ఇన్నింగ్స్ ఆడతానని నమ్మకంతో రాసుకున్న ఆ చీటీని కెమెరా ముందు ప్రదర్శించి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

61 పరుగులకే 5 వికెట్లు.. మ్యాచ్‌ను తిప్పిన హంజా-హస్నైన్ జోడీ
209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ను భారత బౌలర్లు ప్రారంభంలో తీవ్రంగా దెబ్బతీశారు. కేవలం 61 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హంజా జహూర్, సహచర బ్యాటర్ హస్నైన్ అబ్బాస్ దార్‌తో కలిసి ఆరో వికెట్ కు 107 పరుగులు అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ రూపురేఖలనే మార్చేశాడు. హంజా జహూర్ 10 ఫోర్లు, 3 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి ఒత్తిడిలోనూ నిలకడగా ఆడాడు. "డగౌట్ నుంచి నాకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. నేను చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ ను ముగించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. అనుకున్న ప్రణాళిక ప్రకారమే ఆడి జట్టుకు విజయాన్ని అందించాను" అని పాక్ బ్యాటర్ హంజా జహూర్ పేర్కొన్నారు.
అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా ఆదివారం ఒమన్‌లోని అల్ అమెరాట్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో భారత్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 48.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అర్జున్ రాజ్‌పుత్ వీరోచిత సెంచరీతో భారత్‌ను ఆదుకున్నప్పటికీ.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.
Hamza Zahoor note before the match. Tomorrow match 50 Hamza Zahoor- is what the note reads. He's doubled that. Terrific hundred. #HamzaZahoor #PAKvsIND https://t.co/hMHzdHVE7Z
— Nawaz. (@Rnawaz0) November 8, 2026














Click it and Unblock the Notifications
