కోహ్లీ.. కింగ్ ఆఫ్ ఛేజింగ్: ఇన్నాళ్లకు సచిన్ టెండుల్కర్ రికార్డ్ బద్దలు

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ లో జరుగుతున్న మొదటి వన్డేలో అద్భుతంగా ఆడాడు. వన్డేల్లో ఛేజింగ్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నూతన చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇప్పుడది మరుగునపడింది. సచిన్ టెండుల్కర్ ప్రపంచ రికార్డును కోహ్లీ అధిగమించాడు. రన్ ఛేజింగ్ లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

వన్డే ఛేజింగ్‌లలో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీకి 54 పరుగులు అవసరం అయ్యాయి. న్యూజిలాండ్ నిర్దేశించిన 185 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో 39వ బంతిని ఎదుర్కొన్న కోహ్లీ.. తన వ్యక్తిగత 54వ పరుగును పూర్తి చేశాడు. దీంతో వన్డేల్లో రెండో ఇన్నింగ్స్‌లో సచిన్ సాధించిన 8,720 పరుగుల రికార్డు కనుమరుగైంది. వన్డేల్లో విరాట్ కోహ్లీ ఛేజింగ్‌లో 8,721 కంటే ఎక్కువ పరుగులతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచాడు.

Virat Kohli now has the Most Runs in Run chases ODI Cricket History Sachin Tendulkar record erased

ఈ మ్యాచ్ లో 74 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు కోహ్లీ. 51 బంతుల్లో ఒక సిక్స్, 13 ఫోర్లతో 74 పరుగులు చేసి, జాకబ్ డఫీ బౌలింగ్ లో టిమ్ సీఫెర్ట్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇప్పటివరకు 176 వన్డే మ్యాచ్‌ల్లో 169 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ఈ అసాధారణ మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ రెండో స్థానానికి పరిమితం అయ్యాడు. టీమిండియా మాజీ కేప్టెన్ రోహిత్ శర్మ 167 మ్యాచ్‌ల్లో 163 ఇన్నింగ్స్‌ల ద్వారా 6,801 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

కర్ణాటకలో అమాంతం పెరిగిన ఆర్టీసీ బస్ ఛార్జీలు: బీఎంటీసీ బస్సుల్లో కనీస ఫేర్ ఇంత
కర్ణాటకలో అమాంతం పెరిగిన ఆర్టీసీ బస్ ఛార్జీలు: బీఎంటీసీ బస్సుల్లో కనీస ఫేర్ ఇంత

సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును తిరగరాయడానికంటే ముందే కోహ్లీ అదే ఇన్నింగ్స్‌లో మరొక ఘనతను సాధించాడు. భారత్ వెలుపల ఆడిన వన్డే మ్యాచ్‌లలో 50వ సారి 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. విదేశీ గడ్డపై ఇప్పటివరకు 128 వన్డేలు ఆడిన కోహ్లీ 21 సెంచరీలు, 29 అర్ధసెంచరీలతో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. స్వదేశంలోనే కాకుండా విదేశీ పిచ్‌లపై కూడా కోహ్లీ ఎంత ప్రభావవంతంగా ఆడగలడో ఈ గణాంకాలు స్పష్టం చేస్తోన్నాయి.

భారత్ వైపు దూసుకొస్తోన్న 1.5 టన్నుల నాసా స్పేస్ టెలిస్కోప్ శకలాలు: రాడార్ లో హైదరాబాద్
భారత్ వైపు దూసుకొస్తోన్న 1.5 టన్నుల నాసా స్పేస్ టెలిస్కోప్ శకలాలు: రాడార్ లో హైదరాబాద్

తన 38వ జన్మదిన వేడుకలకు సరిగ్గా ఒకరోజు ముందు ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టే రికార్డుకు కూడా కోహ్లీ అత్యంత సమీపంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌పై పాంటింగ్ పరుగుల మైలురాయిని దాటడానికి కోహ్లీకి ఇంకా 74 పరుగులు అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+