Garividi Lakshmi Review: ఆనంది 'గరివిడి లక్ష్మి' మూవీ రివ్యూ ఇదే..
1990 వ దశకంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతి ఇంటా మార్మోగిన పేరు రెడ్డి విజయలక్ష్మి అలియాస్ గరివిడి లక్ష్మి.. అలా ఓ దశాబ్దం పాటు తన జానపద గేయాలతో అలరించిన కళాకారిణి గరివిడి లక్ష్మి. అయితే తాజాగా ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం గరివిడి లక్ష్మి. దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించారు. ఆమెతోపాటు రాగ్ మయూర్, నరేశ్, రాశి, షకలక శంకర్, ఎల్బీ శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్, అంకిత్ కొయ్య, శరణ్య ప్రదీప్, కంచరపాలెం కిశోర్, నితిన్ ప్రసన్న, వైవా రాఘవ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పించింది..?
గరివిడి లక్ష్మి కథ విషయానికి వస్తే.. లక్ష్మి(ఆనంది) చిన్నతనంలోనే తండ్రికి దూరమై అనేక కష్టాలను ఎదుర్కుంటుంది. ఆమెకు 12 సంవత్సరాల వయసులోనే వివాహం జరుగుతుంది. అయితే భర్త చేతిలో మోసపోయిన లక్ష్మి తిరిగి తన తల్లి దేవుడమ్మ(రాశి) వద్దకు చేరుతుంది. ఇక లక్ష్మికి చిన్నతనం నుంచే పాటలపై ఆసక్తి ఉంటుంది. అలా ఆమె బుర్రకథలను నేర్చుకుంటుంది. అలా సత్యం(రాగ్
మయూర్) బృందంలో చేరుతుంది. అనంతరం బాలనాగమ్మ పాటను పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. అలా ఉత్తరాంధ్రలో ప్రముఖ జానపద గాయనిగా ఎదుగుతుంది. అయితే నమ్మినవారే ఆమెను ఎలా మోసం చేశారు..? ఆ తర్వాత ఆమె జీవితం ఎలా మారింది..? గుర్తింపు కోసం ఆమె ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది..? అనేది సినిమా స్టోరీ..

ఇక నటీనటుల పనితీరు విషయానికి వస్తే హీరోయిన్ ఆనంది.. గరివిడి లక్ష్మి పాత్రలో జీవించిందనే చెప్పాలి. భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకుంది ఆనంది. ఆమెతోపాటు సీనియర్ నటుడు నరేష్, యంగ్ హీరో రాగ్ మయూర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే రాశి, శరణ్య ప్రదీప్ తదితరులు తమ పరిధి మేరకు మెప్పించారు. ఇక ఫస్టాఫ్ నెమ్మదిగా సాగుతుంది. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో లేకపోవడం కొంత వెలితిగా అనిపిస్తుంది. కానీ రియల్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
