పిరికివాళ్లు, సున్నిత మనస్కులకు న్యాయవాద వృత్తి ఏ మాత్రం తగినది కాాదు..: సీజేఐ సూర్యకాంత్

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీజేఐ ప్రసంగించారు. వారికి దిశా నిర్దేశం చేశారు. న్యాయవాద వృత్తిలో ఎదురయ్యే సవాళ్ల గురించి వివరించారు. లా గ్రాడ్యుయేట్లపై దేశం ఎన్నో ఆశలు పెట్టుకుందని, సమాజంలో అన్యాయాలను ఎదిరించే ఆశాదీపాలుగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

న్యాయవాద అనేది పిరికివాళ్లు, సున్నిత, బలహీన మనస్సు ఉన్న వారికి ఎంతమాత్రం కూడా తగినది కాదని సీజేఐ సూర్యకాంత్ తేల్చి చెప్పారు. సమాజంలో నిరుపేదలు, బాధితులకు సమన్యాయం అందించడానికి ఈ తరహా మనస్తత్వం సరిపోదని వివరించారు. సమాజంలో ధర్మాన్ని, న్యాయాన్ని రక్షించే క్రమంలో అనేక సవాళ్లకు ధీటుగా, ధైర్యంగా నిలబడాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఈ వృత్తిలో రాణించాలంటే భయం లేని మనస్తత్వం, ఎంతో గుండె నిబ్బరాన్ని కలిగి ఉండాలని సూచించారు.

Legal profession is not for the faint of heart says CJI Suryakant urging demonstrate the courage

సమాజంలో ఎవరికీ వినిపించని అణగారిన వర్గాల స్వరాలను వినే వినమ్రతను అలవర్చుకోవాలని అన్నారు. మేధోపరమైన స్వతంత్రత, నైతిక బాధ్యత అత్యంత అవసరమని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. వృత్తిపరమైన సంక్లిష్టతలను ఎదుర్కొనడానికి మేధోపరమైన సమర్థతతో పాటు ఉన్నత ఆలోచనలు, దానికి తగ్గ నైతిక బాధ్యత కూడా అవసరమని, అప్పుడే సమన్యాయం అందించగలుగుతామని, ప్రాథమిక న్యాయసూత్రాలను అనుసరించగలుగుతామని సీజేఐ వ్యాఖ్యానించారు.

ముంబై ఇండియన్స్ లో బిగ్ వికెట్ డౌన్- తెగిన పదేళ్ల అనుబంధం
ముంబై ఇండియన్స్ లో బిగ్ వికెట్ డౌన్- తెగిన పదేళ్ల అనుబంధం

తాత్కాలిక ప్రయోజనాల కోసమో, త్వరగా విజయాలను సాధించాలనే తపనతోనో వృత్తిపరమైన విలువలతో ఎప్పుడూ రాజీపడకూడదని యువ లాయర్లను హెచ్చరించారు. చట్టం అనేది ఒకేచోట, ఒక కాలాని పరిమితం అయ్యే వ్యవస్థ కాదని, దానిని ఆచరించే న్యాయవాదులు, న్యాయమూర్తుల ఆలోచనలు, చర్యల ద్వారా నిరంతరం పరిణామం చెందుతుంటుందని వివరించారు. వీటికి సంబంధించిన పుస్తకాలను చదవడం, రాజ్యాంగ సూత్రాలకే పరిమితం కాకుండా భిన్నమైన అభిప్రాయాలు, విభిన్న నేపథ్యాలు ఉన్న వ్యక్తులతో చర్చించడం ద్వారానే పరిపూర్ణ అవగాహన వస్తుందని పేర్కొన్నారు.

బెంగళూరు విధానసౌధలో షర్మిల: కుమారుడితో కలిసి సీఎం డీకే శివకుమార్ తో
బెంగళూరు విధానసౌధలో షర్మిల: కుమారుడితో కలిసి సీఎం డీకే శివకుమార్ తో

ఎదుటివారి అభిప్రాయాలతో విభేదించినప్పటికీ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా తమ వాదనలను వినిపించే స్వతంత్ర మేధో సంస్కృతిని పెంపొందించుకోవాలని ఆయన కోరారు. నేషనల్ లా స్కూల్ లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, దీన్ని బట్టి చూస్తే న్యాయవాద వృత్తిని ఎంచుకోవడానికి యువత ముందుకు వస్తోందని, ఇది శుభసూచకమని సీజేఐ వ్యాఖ్యానించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన హాస్టళ్లు, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం అవసరమని సూచించారు.

అనంతరం డీకే శివకుమార్ మాట్లాడారు. నేషనల్ లా స్కూట్ అభివృద్ధి, దాని ప్రతిష్టను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. విశ్వవిద్యాలయ విస్తరణ, భవిష్యత్ అవసరాల కోసం 10 ఎకరాలు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. న్యాయశాఖకు సంబంధించిన నూతన భవన నిర్మాణ ప్రతిపాదనపై త్వరలోనే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+