జాన్వీ కపూర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్..? బీచ్‌లో రచ్చ రచ్చ
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా పేరు మార్మోగిపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి, కప్ గెలవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. ఇదే సమయంలో వ్యక్తిగతంగా కూడా హార్దిక్ పాండ్యా వార్తల్లో నిలిచారు. భార్య నటాషాతో హార్దిక్ విడిపోయారు. ఆమెకు విడాకులు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్, ఆ తర్వాత భార్య నటాషాతో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఆమెకు విడాకులిచ్చాడు.
కొడుకుతో కలిసి నటాషా తన సొంత దేశం అయిన స్వీడన్‌కు వెళ్లిపోయారు. భార్యతో విడాకులు అనంతరం హార్దిక్ , బాలీవుడ్ హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలొచ్చాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే, హార్దిక్ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. వీరిద్దరు కలిసి అంబానీ పెళ్లిలో సందడి చేశారు. హిందీ పాటలకు ఇద్దరు కలిసి చిందులు వేసిన వీడియోలు సోషల్ మీడియిలో తెగ వైరల్ అయ్యాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో వీరిద్దరు ఒకర్ని ఒకరు ఫాలో అవుతున్నారు.

దీంతో అనన్య పాండే, హార్దిక్‌లు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అంబానీ పెళ్లి తర్వాత వీరిద్దరు తరుచుగా కలుసుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇటు హార్దిక్ భార్యకు విడాకులు ఇవ్వడం, అటు అనన్య పాండే పలువురు హీరోలకు బ్రేకప్ చెప్పి సింగిల్‌గా ఉండటంతో వీరిపై పుకార్లు షికార్లు చేశాయి. అయితే వీరి బంధం కేవలం ప్రచారం వరకే మిగిలిపోయింది. తాజాగా హార్దిక్ పాండ్యా స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది.
వీరిద్దరు కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలు సైతం బయటకు రావడంతో వీరు ప్రేమలో ఉన్నారని అంతా భావించారు.అయితే ఏఐ టెక్నాలజీ ద్వారా వీరి ఫొటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారని తర్వాత తేలింది. ఇటీవల క్రికెటర్ షమీ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫొటోలను సైతం ఇదే మాదిరిగా సోషల్ మీడియాలో ఆప్‌లోడ్ చేశారు. వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పబ్లిసిటీ చేశారు. ఇప్పుడు ఈ బాధితుల జాబితాలో హార్దిక్ పాండ్యా ,జాన్వీ కపూర్‌లు కూడా చేరారు. దీనిపై సెలబ్రిటీలెవ్వరూ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications