ప్రతి పది నిమిషాలకు ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'హరిహర వీరమల్లు' ఫస్ట్ రివ్యూ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనేక వాయిదాల తర్వాత, ఈ భారీ బడ్జెట్ చారిత్రక యాక్షన్ డ్రామా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది.
టీమ్ ఇప్పటికే ప్రమోషన్‌లను ముమ్మరం చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను తారా స్థాయికి చేర్చింది. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో, శక్తివంతమైన బందిపోటు వీరమల్లుగా కనిపించి అభిమానులను ఉర్రూతలూగించారు. ఔరంగజేబు కాలం నాటి చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో, బందిపోటు వీరమల్లు కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడమే తన లక్ష్యంగా పని చేయబోతున్నట్టు ట్రైలర్ స్పష్టం చేసింది. ఇది దేశభక్తి, వీరోచిత పోరాటాల కలయికగా కనిపించడం ఆసక్తికరంగా మారింది.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ నెగటివ్ పాత్రలో (ఔరంగజేబుగా) కనిపించనున్నారు. ఇక సినిమా టైటిల్ గురించి టీమ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. "విష్ణువు, శివుడు కలిపిన అవతారం వీరమల్లు" అని చిత్రబృందం పేర్కొంది.
తాజాగా ఈ సినిమాపై దర్శకుడు జ్యోతి కృష్ణ స్పందించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి పది నిమిషాలకు ఒకసారి పవన్ కల్యాణ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తారని ఆయన తెలిపారు. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమని చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ వెల్లడించారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతంగా వచ్చిందని , ఎలివేషన్ సీన్లను బాగా బిల్డప్ చేశామని ఆయన వెల్లడించారు.ఈ సీన్లు అభిమానులు థ్రిల్ అవుతారని, ఇది తాను ఇస్తోన్న హామీ అని ఆయన చెప్పుకొచ్చారు. పవర్ స్టార్‌కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్‌తోపాటు మూవీ లవర్స్ కూడా ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications