బ్యాగులో రూ. 11.82 కోట్ల విలువైన డ్రగ్స్.. హీరోయిన్ అరెస్ట్..

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అధికారులు చేపట్టిన చెకింగ్ లో కేరళ ప్రముఖ మోడల్, 'మిసెస్ కేరళ గ్లోబల్ 2025' రన్నరప్ హర్షా సన్నీ బ్యాగులో సుమారు 11 కిలోలకు పైగా హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు మోడల్ హర్షా సన్నీని అరెస్ట్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 11.82 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నిన్న రాత్రి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుండి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న హర్షా సన్నీ కదలికలపై అధికారులకు అనుమానం వచ్చింది. దాంతో కస్టమ్స్ అధికారులు ఆమె బ్యాగ్ ను తనిఖీ చేశారు. దాంతో ఆమె బ్యాగులో భారీగా డ్రగ్స్ చూసి షాక్ అయ్యారు.

HarshaSunny Arrested at Airport Massive 11 82 Crore Drug Haul Seized by Authorities HarshaSunny

భారత్ లోకి నిషేధిత మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన ఆరోపణలపై హర్షా సన్నీని ఎన్‌ డీపీఎస్‌ చట్టం కింద కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న హైడ్రోపోనిక్ గంజాయి మార్కెట్ విలువ సుమారు రూ. 11.82 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక సన్నీని ముంబైలోని ఫోర్ట్ కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక 28 ఏళ్ల మోడల్ హర్షా సన్నీ స్వస్థలం కేరళలోని వాయనాడ్.. ఆమె వృత్తి రిత్యా బ్యాంకర్.. కానీ మోడలింగ్, డాన్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా ఆమెకు గుర్తింపు ఉంది. గతేడాది కొచ్చిలో జరిగిన మిసెస్ కేరళ గ్లోబల్ 2025 అందాల పోటీల్లో ఆమె ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. దాంతోపాటు మిసెస్ కేరళ ఇన్ స్పైరింగ్ సబ్ టైటిల్ ను కూడా గెలుచుకుంది హర్షా సన్నీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+