సెంట్రల్ జైలుకు నటి, మళ్లీ పోలీసు కస్టడీకి హీరో, కోర్టులో హీరోకు ఎదురు దెబ్బ, ఇది కథ !
కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని బెంగళూరులో హత్య చేసిన కేసులో కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, అతని గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ సహా మొత్తం 17 మందిని గురువారం బెంగళూరులోని 24వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో పవిత్ర గౌడ సహా 12 మంది నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నటి పవిత్ర గౌడతో పాటు నిందితులు ఇప్పుడు బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లడం ఫిక్స్ అయ్యింది. హీరో దర్శన్ (ఏ2)తో పాటు రాజు (ఏ9), వినయ్ (ఏ10), ప్రదోష్ (ఏ14)లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని వారిని మరింత విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు. తదుపరి విచారణ నిమిత్తం హీరో దర్శన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు ఏ1, ఏ3 నుంచి ఏ7, ఏ11 నుంచి ఏ13, ఏ16 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పవిత్రగౌడ్, పవన్, రాఘవేంద్ర, నందీష్, జగదీష్, అనుకుమార్, నాగరాజ్, లక్ష్మణ్, దీపక్, కేశవ్ మూర్తి, వీరిని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించడానికి పోలీసులు సిద్దం అయ్యారు. నిందితుల జాబితా ఇలా ఉంది. వినయ్, A11, A13, ప్రదోష్, A16.
దర్శన్ సహా నలుగురు నిందితులు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు.రిమాండ్‌కు దరఖాస్తు చేసి దర్శన్, వినయ్, ప్రదోష్, లక్ష్మణ్, నాగరాజ్‌లను పోలీసు కస్టడీకి అప్పగించాలని అభ్యర్థించారు. అంతేకాకుండా ఏ1 నిందితురాలు పవిత్ర గౌడతో పాటు మరో 12 మంది నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు.హత్యకేసులో పోలీసుల తరఫు న్యాయవాది పి. ప్రసన్నకుమార్ వాదించారు. దర్శన్ తరఫు న్యాయవాది అనిల్ బాబు, పవిత్రగౌడ్ తరఫు న్యాయవాది నారాయణస్వామి కోర్టులో వాదించారు.
జూన్ 8వ తేదీన రేణుకాస్వామిని చిత్రదుర్గలో కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకొచ్చి పట్టనగెరెలోని షెడ్డులో ఉంచి చిత్రహింసలకు గురిచేసి దారుణంగా హత్య చేసి అతని శవాన్ని సుమనహళ్లి సమీపంలోని డ్రైనేజ్ లో పడేశారు. జూన్ 9వ తేదీన రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది. జూన్ 11వ తేదీన మైసూర్‌లో హీరో దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.రేణుకాస్వామి మృత దేహానికి సంబంధించిన పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్నట్లుగా అతని చేతిపై కోత, వీపుపై గాయాలు, తలకు గాయం, వృషణంపై గాయం, మెదడు దగ్గర రక్తస్రావం, కాళ్ళపై గాయం, మెడపై గాయం, ఛాతీపై కాటు గాయం ( కుక్క కాటు) ఉంది.
రేణుకాస్వామిపై జరిగిన దాడి చివరి దశలో దర్శన్ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుకాస్వామి మర్మాంగం ఫోటో పంపినందుకు ఆగ్రహించిన దర్శన్ రేణుకాస్వామిని చితకబాదేశాడని, అతని వృషణాలు, ఛాతీపై తొక్కుతూ చిత్రహింసలు పెట్టాడరని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దాడితో రెచ్చిపోయిన దర్శన్ సహచరులు రేణుకాస్వామిని నీట ముంచారు. అతన్ని పట్టుకుని అక్కడే నిలబడిన లారీని ఢీకొట్టారు. లారీకి బలంగా కొట్టడంతో రేణుకాస్వామి తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయి రక్తస్రావంతో మృతి చెందడని పోలీసులు అంటున్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications