వినూత్న కార్యక్రమం చేపట్టిన యంగ్ హీరో

'జెట్టి' సినిమాతో హీరోగా సుపరిచితులైన కృష్ణ మానినేని కేవలం సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. గతంలో విజయవాడ వరదల సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రశంసలు అందుకున్నాయి.

ఇప్పుడు, జూన్ 14న ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా, కృష్ణ మానినేని మరో గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చారు. "సింధూర సంజీవని" పేరిట ప్రతి సంవత్సరం జూన్‌లో తన మిత్రులతో కలిసి రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో, రేపు, జూన్ 29న చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించనున్నారు.

hero Krishna Manineni to organize blood donation camp

ఈ సందర్భంగా కృష్ణ మానినేని యువతకు పిలుపునిచ్చారు. తనతో పాటు మరో పది మంది యువకులు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో పాల్గొని ప్రాణాలను నిలబెట్టే ఈ గొప్ప కార్యంలో భాగం కావాలని కోరారు. సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధత, సేవా భావం అభినందనీయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+