మళ్లీ కలవనున్న సిద్ధార్థ్-సమంత?
స్టార్ కథానాయికగా కొనసాగుతున్న సమంత తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టి 14 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. మనకు సమంత అనే పేరు వినగానే రెండు విషయాలు వెంటనే గుర్తుకు వస్తాయి. ఒకటి.. నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు కాగా, రెండో అంశం.. మయోసైటిస్. మయోసైటిస్ వల్ల ఏడాది నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది. చికిత్స తీసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే కథలను తిరిగి వింటోంది. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తోంది. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమయంలో ఎంత పాపులర్ అయిందో విడాకులు తీసుకున్న తర్వాత అంతకంటే ఎక్కువగా పాపులర్ అయింది.
నాగచైతన్యను వివాహం చేసుకోకముందు సమంత సిద్ధార్థ్ తో ప్రేమలో మునిగింది. ఇద్దరూ ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. కారణం తెలియదుకానీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అదే సమయంలో ఏమాయ చేశావే సినిమాతో నాగచైతన్య పరిచయం కావడంతో వారి స్నేహం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి, విడాకులకు దారితీసింది. సమంతకు పెళ్లయిన తర్వాత సిద్ధార్థ్ వేరే అమ్మాయిలను ప్రేమించాడు. తర్వాత ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సిద్ధార్థ్-సమంత తిరిగి కలవబోతున్నారంటున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ... సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిస్ బ్యూటిఫుల్ ఎవరు అని యాంకర్ సిద్ధార్థ ను అడిగితే వెంటనే అతను సమంత అని చెప్పాడు. మిస్ పర్ఫెక్ట్ ఎవరు అని యాంకర్ మరో ప్రశ్న అడగ్గా.. అప్పుడు కూడా సమంత అనే చెప్పాడు. దీంతో సమంతను సిద్ధార్థ మర్చిపోవడంలేదని, త్వరలోనే కలవబోతున్నారంటూ వార్త వైరల్ గా మారింది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సమంత తిరిగి సిద్ధార్థ్ తో కలిసే ప్రసక్తే ఉండదని సామ్ అభిమానులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఎప్పుడైనా, ఏమైనా జరగొచ్చంటున్నారు. చూడాలి.. ఏం జరుగుతుందో.












Click it and Unblock the Notifications