బ్రేకప్ చెప్పుకున్న రష్మిక - విజయ్ దేవరకొండ?

రష్మిక - విజయ్ దేవరకొండ జంట ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ప్రతి రెండురోజులకోసారి వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంటుంది. చాలామంది వీరిని సైలెంట్ లవ్ బర్డ్స్ అంటుంటారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ చాలామంది తమ అభిప్రాయాలను తెలియజేశారు.

ప్రేమగా మారిన స్నేహం
గీత గోవిందం సినిమా తర్వాతే వీరిద్దరి మధ్య స్నేహం మొదలై చివరికి ప్రేమలా మారిందని, ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లడం, అక్కడ ఎంజాయ్ చేయడం, చెట్టాపట్టాలేసుకొని తిరగడం లాంటివి జరుగుతున్నాయంటూ వార్తలు వచ్చాయి. నిశ్చితార్థం కూడా జరిగిపోయిందంటున్నారు. వీరిద్దరూ ఇంతవరకు దీనిపై స్పందించలేదు. కొన్ని సందర్భాల్లో మాత్రం తాము కేవలం స్నేహితులమే అని చెప్పారు. అయినా రూమర్లు మాత్రం ఆగలేదు.

hero vijay devarakonda and heroine rashmika breakup

శుభాకాంక్షలు చెప్పలేదు
అయితే వీరిద్దరికి సంబంధించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. ఈనెల 9వ తేదీన విజయ్ దేవరకొండ పుట్టినరోజు జరుపుకున్నాడు. సెలబ్రిటీలతోపాటు అభిమానులు కూడా పెద్దసంఖ్యలో తనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రష్మిక మాత్రం శుభాకాంక్షలు తెలియజేయలేదు. కనీసం స్టేటస్ కూడా పెట్టలేదని, ట్వీట్ కూడా చేయలేదంటున్నారు. త్వరలోనే వీరిద్దరికీ పెళ్లి జరగబోతోంది.. నిశ్చితార్థం కూడా జరిగింది... డేట్ కూడా అనుకున్నారు.. అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కావాలనే రష్మిక విజయ్ కు శుభాకాంక్షలు తెలియజేయలేదని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి ఇందులో నెజమెంతో వీరిద్దరికే తెలియాలి. నిజంగానే బ్రేకప్ చెప్పుకున్నారా? అభిమానుల దృష్టిని మళ్లించడానికి ఏదైనా నాటకమాడుతున్నారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ వీరిద్దరికి బ్రేకప్ జరిగిందంటూ సినీ పరిశ్రమలో సంచలనమే అని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+