కియారా అద్వానీ కోసం హీరోనే బాడీగార్డ్.. సెట్‌లో ఏం జరిగిందంటే?
పాన్ ఇండియా స్టార్ హీరో యశ్, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'టాక్సిక్'లో యశ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కియారా అద్వానీ ప్రెగ్నెంట్‌గా ఉన్నారని.. ఆమె విషయంలో తాము ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని హీర్ యశ్ తెలిపారు. ముంబైలో జరిగిన 'టాక్సిక్' ఆడియా లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన హీరో యశ్.. సెట్లో కియారా అద్వానీ ప్రొఫెషనలిజమ్‌ను ఎంతగానో ప్రశంసించారు.
నేను, గీతూ కియారాకు బాడీగార్డ్స్‌లా ఉన్నాం..
ఆడియో లాంచ్‌లో యశ్ మాట్లాడుతూ.. "కియారా అద్వానీ చాలా ప్రొఫెషనల్ నటి. ఈ సినిమా షెడ్యూల్స్ చాలా శ్రమతో కూడుకున్నవి కావడంతో మొదట్లో నేను కాస్త కంగారు పడ్డాను. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటికీ ఆమె 100 శాతం అంకితభావంతో షూటింగ్లో పాల్గొంది. నా కంటే కూడా డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ఆమె ఆరోగ్య పరిస్థితిపై చాలా ఆందోళన చెందారు. షూటింగ్ సెట్లో నేను, గీతూ ఇద్దరం కియారాకు బాడీగార్డ్స్‌లా మారిపోయి కియారాను కంటికి రెప్పలా చూసుకున్నాం. ఆమె పడ్డ శ్రమకు, చూపించిన డెడికేషన్ కు కియారా అద్వానీకి నా ధన్యవాదాలు" అంటూ హీరో యశ్ పేర్కొన్నారు.

'టాక్సిక్' నా కెరీర్లోనే మైలురాయి: కియారా ఆద్వానీ
అంతకు ముందు బెంగళూరులో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కియారా అద్వానీ మాట్లాడుతూ.. ఇందులో తాను పోషించిన 'నాదియా' పాత్ర తన కెరీర్‌ను 'టాక్సిక్' కంటే ముందు.. తర్వాత అని చెప్పేలా మారుస్తుందని పేర్కొన్నారు. దర్శకురాలు గీతూ, హీరో యశ్ తనపై ఉంచిన నమ్మకమే తను ఈ పాత్ర చేయడానికి నడిపించిందన్నారు. తన నటనపై తనకున్న అంచనాలను ఈ సినిమా పూర్తిగా మార్చేసిందన్నారు. ఓ నటిగా తాను ఎంతటి కష్టమైన పాత్రనైనా చేయగలననే నమ్మకాన్ని వారు తనలో నింపారని కియారా అద్వానీ హర్షం వ్యక్తం చేశారు.














Click it and Unblock the Notifications