పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న మెగా హీరోయిన్

తెలుగు, తమిళ, మళయాళ చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది ఐశ్వర్య లక్ష్మి. మెగా హీరో సాయిధరమ్ తేజ్ 18వ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇంతకుముందు తెలుగులో గాడ్సే, అమ్ము వంటి సినిమాల్లో నటించింది. సాయిధరమ్ తేజ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 2025లో విడుదల చేయాలని నిర్మాత, దర్శకులు భావిస్తున్నారు. దీనిపై సాయిధరమ్ తేజ్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఐశ్వర్య లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో పలు విషయాలను తెలియజేసింది.

తన నిర్ణయాన్ని మార్చుకున్నాను
తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎంతోమంది జంటలను చూస్తున్నానని, తనముందే పెళ్లి చేసుకొని తర్వాత విడిపోయారని, చాలామంది అయితే పెళ్లి అయింది కాబట్టి, తప్పనిసరి పరిస్థితుల్లో కలిసి జీవించాలనే నిర్ణయంతో బలవంతంగా కలిసివున్నట్లుగా అర్థమైందన్నారు. అలా చేయడంవల్ల వ్యక్తిగతంగా కూడా జీవితంలో ఎదగలేకపోతున్నారని, ఇవన్నీ చూసిన తర్వాత తనకు వివాహం చేసుకోవాలనే ఆలోచన లేనట్లు తెలిపింది. కేరళలోని గురువాయూరు దేవాలయంలో ఎన్నో పెళ్లిళ్లను చూశానని, అప్పుడు తనకు 25 సంవత్సరాల వయసు అని, ఆ పెళ్లిళ్లు చూసినప్పుడల్లా తాను కూడా అలాగే చేసుకోవాలనుకున్నానని, కానీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది.

heroine Aishwarya Lakshmi has decided not to get married in her life

ఒంటరిగా జీవించడమే మంచిది
తనకు కొంత వయసు వచ్చిన తర్వాత, కొన్ని అనుభవాలను చూసిన తర్వాత వివాహంపై ఓ స్పష్టత వచ్చిందని ఐశ్వర్య లక్ష్మి తెలిపింది. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తెలిపింది. కొన్ని సంవత్సరాల క్రితం ఓ మాట్రిమోనీ సైట్ లో తన ప్రొఫైల్ కూడా పెట్టానని, అది చూసి చాలామంది ఫేక్ ప్రొఫైల్ అనుకున్నారని చెప్పింది. పెళ్లిగురించి ఐశ్వర్య అంత వివరంగా చెప్పడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

పెళ్లి చేసుకుంటేనే మంచిదని, జీవితంలో చివరి వరకు తోడుంటుందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఐశ్వర్య నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. జీవితంలో ఎంతోమంది భార్యాభర్తలు రాజీపడి బతుకుతున్నారని, మనసులో ఒకటి, బయట ఒకటి అనుకుంటూ అలా జీవించేకన్నా విడిగా జీవించడమే మంచిదని, ఐశ్వర్య తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్ధిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+