సిగ్గు లేదురా మీకు.. షేక్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్!
టెక్నాలజీ అందుబాటులోకి రావడం మంచిదేకానీ అది అందరికీ ఉపయోగపడాలని చాలామంది భావిస్తుంటారు. అయితే టెక్నాలజీ వల్ల కొంతమందికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇటీవలికాలంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పేరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతోంది. బోల్డ్ పాత్రల్లో రెచ్చిపోయి నటిస్తోందంటూ ఆమె సొంత ఫ్యాన్సే టిల్లు స్క్వేర్ పై మండిపడ్డారు. తాజాగా ఆమె మీద సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న అనుపమ పెళ్లి చేసుకోబోతోందనే వార్త వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోతో గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతోందని, వారిద్దరూ చాలాసార్లు బయట షికారుకు వెళ్లారంటూ ఆ వార్తలో ఉంది. వారిద్దరికీ నిశ్చితార్థం కూడా అయిపోందని, రేపో మాపో పెళ్లి చేసుకోబోతోందంటున్నారు.

అయితే ఇలాంటి వార్తలను అనుపమ ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వచ్చింది. ఫేక్ వార్తలను నమ్మొద్దంటూ అభిమానులకు విన్నవించుకుంది. అభిమానులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తపై మండిపడుతున్నారు. ఎన్నిసార్లు ఇలాంటి ఫేక్ వార్తలను క్రియేట్ చేస్తారురా? మీకు సిగ్గుందా? బుద్ది ఉందా? ఆమె పెళ్లి చేసుకుంటే చెప్పకుండా చేసుకుంటుందా? అందరికీ చెబుతందిగా.. మీకు ఎందుకు అంత సంతోషం.. అంటూ ఓ రేంజ్ లో అభిమానులు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ అభిమానులు పెడుతున్న కామెంట్లతో యుద్ధ వాతావరణం కనపడుతోంది. ఇటీవలి కాలంలో ఏ హీరోయిన్ పై ఇన్ని ఫేక్ వార్తలు రాలేదని, ఏ హీరోయిన్ పెళ్లి వార్త ఇంత పాపులర్ అవలేదని, ఇటువంటి వార్తలు రాసేవారు ఒళ్లు దగ్గరపెట్టుకొని రాయాలని, కావాలనే ఇలా చేస్తున్నారంటూ అనుపమ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications