ఒంపుల హంపీ శిల్పమా? బాపూ గీసిన చిత్రమా?
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తె మాళవిక మోహన్. తన కెరీర్ ను మోడల్ గా ప్రారంభించింది. కేరళలో పుట్టినప్పటికీ పెరిగిందంతా ముంబయిలోనే. 2013లో విడుదలైన మలయాళ చిత్రం 'పట్టం పోలే' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తర్వాత మరో మళయాళ సినిమా చేసింది. రజనీకాంత్ సినిమా పేటలో అనూహ్యంగా కీలక పాత్ర దక్కించుకుంది. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు కాగా త్రిష మరో హీరోయిన్ గా నటించింది.
మాళవిక మోహన్ మాస్టర్ సినిమాలో అధ్యాపకురాలి పాత్రలో అలరించింది. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ మాళవిక పాత్రకు మాత్రం ప్రాధాన్యత లేదు. ఒక క్రేజీ ప్రాజెక్టుతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ పక్కన మాళవిక మోహన్ ఛాన్స్ కొట్టేసింది. మారుతి తీస్తున్న రాజాసాబ్ లో ఆమె ఒక హీరోయిన్. ఈ సినిమాలో ఆమె ఫైట్స్ చేయబోతోంది. మార్కెట్ లో రౌడీలను కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. రాజా సాబ్ సినిమా కామెడీ హారర్ థ్రిల్లర్ అంటున్నారు. నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాను కూడా ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారంటున్నారు. మరోవైపు విక్రమ్ కు జంటగా తంగలాన్ సినిమా చేస్తోంది. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకుడు. ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తోంది. ఒకరకంగా ఇప్పుడిప్పుడే కెరీర్ ఊపందుకుంటోందని చెప్పొచ్చు. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కాలంటే ఎంతో గ్లామరస్ లుక్ ఉండాలనే సంగతి తెలిసిందే. అందుకే జిమ్ లో ప్రతిరోజు గంటల తరబడి కష్టపడుతుంది. జిమ్ ఫిట్ లో ఎంతో హాట్ గా ఉన్న మాళవిక లేటెస్ట్ సినిమాలు వైరలవుతున్నాయి.












Click it and Unblock the Notifications