అటు చూసే కుర్రాళ్లు.. అసలేమైపోతారు? అన్యాయం కదూ..!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేహా శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. కర్ణాటకలో పుట్టిన నేహా మొదట్లో మోడల్ గా పనిచేసింది. తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు పరిశ్రమలోనే ఆమెకు మంచి పేరు దక్కింది. 2016లో కన్నడ పరిశ్రమలో ముంగారు మగ 2 సినిమాతో అడుగుపెట్టింది. ఇది సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడు మంచి పాపులర్ అయింది. తర్వాత కన్నడలో సినిమాలు చేయకుండానే తెలుగులోకి అడుగుపెట్టింది.
2018లో మెహబూబా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేసిన ఈ బ్యూటీ తర్వాత... గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు చేసింది. అయితే సిద్దు జొన్నలగడ్డతో చేసిన డీజే టిల్లు సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత అందరూ ఆమెను నేహా శెట్టి అనే పేరుకన్నా రాధిక అనే పేరుతోనే పిలుస్తుంటారు. దీనితర్వాత రూల్స్ రంజన్ తో మరో విజయాన్ని సాధించింది. తెలుగు ఇండస్ట్రీ నుంచి వరుసగా అవకాశాలు అందుకోవడంతోపాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు చురుగ్గా ఉండటమే కాదు తన అందాలను కూడా ఆరబోస్తుంటుంది. తన ఫొటోలు చూస్తున్న నెటిజన్లు చాలా బాగున్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. వీటికి స్పందిస్తున్న నేహా కొన్నిటికి రిప్లై ఇస్తున్నారు.

2014లో మిస్ మంగళూరు గా నిలిచింది. తర్వాత 2015లో మిస్ సౌత్ ఇండియా రన్నరప్‌గా నిలిచింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించి మెహబూబా కోసం తెలుగు భాషను నేర్చుకుంది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సును అభ్యసించడానికి ఆరు నెలల గ్యాప్ ఇచ్చింది. తర్వాత 2021లో నేహా రెండు సినిమాల్లో నటించింది. వాటిల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో పాత్ర చిన్నది. గల్లీ రౌడీలో మాత్రం ప్రధాన పాత్ర పోషించింది.












Click it and Unblock the Notifications