నందమూరి బాలకృష్ణపై ట్వీట్ చేసిన పూనమ్ కౌర్
తెలుగు సినీ పరిశ్రమలోకి మాయాజాలం అనే సినిమా ద్వారా పరిచయమయ్యింది పూనమ్ కౌర్. అచ్చ తెలుగు ఆడపడుచులా తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నో వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. దీంతో మరింత పాపులారిటీ అందుకుంది. ప్రస్తుతం రాజకీయాలపై తరుచుగా స్పందిస్తూ యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె ఏదైనా పోస్ట్ పెట్టడం ఆలస్యం నిమిషాలలో వైరల్ గా మారుతోంది.
తాజాగా ఈ అమ్మడు భగవంత్ కేసరి సినిమా గురించి ట్వీట్ చేసింది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు బాలయ్య నటన ఒక రేంజ్ లో ఉండటం.. శ్రీ లీల నటన కూడా బాగా కలిసొచ్చింది. ప్రధానంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి బాలయ్య చెప్పడం అద్భుతంగా ఉందంటూ సినీ పరిశ్రమకు చెందినవారితోపాటు అభిమానులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా పూనమ్ కౌర్ ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించింది. సినిమా బాగుందంటూ కొనియాడింది. అంతేకాకుండా తాను కూడా బాలయ్య అభిమానుల్లో చేరిపోతున్నానంది. భగవంత్ కేసరి సినిమా చూడటం చాలా రిఫ్రెష్ గా అనిపించిందని, తాను కూడా జై బాలయ్య బ్యాచ్ లో చేరాలనుకుంటున్నట్లు తెలిపింది.
లడకీ కో షేర్ బనావో అంటూ రాసుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో బాలయ్య అభిమానుల సైతం ఈమెను వెల్కమ్ బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలయ్య పైన చేసిన ట్వీట్ వైరల్ గా మారుతోంది












Click it and Unblock the Notifications