బాత్రూంలో ఫొటోలకు ఫోజులిచ్చిన సమంత
తెలుగులో స్టార్ కథానాయికగా కొనసాగుతున్న సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ తో బాధపడుతుండటంవల్ల ఏడాదిపాటు విరామం ప్రకటించి చికిత్స తీసుకోవాలనుకుంది. పనిలో పనిగా విదేశాలన్నీ చుట్టేసి వచ్చింది. ఎక్కడికి వెళ్లినప్పటికీ, తాను ఎక్కడున్నప్పటికీ, ఏం చేస్తున్నాననే విషయాలను మాత్రం సోషల్ మీడియాద్వారా తెలియజేస్తుంటుంది. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తుంటుంది.
వాస్తవానికి సమంత అనగానే ప్రధానంగా రెండు విషయాలు అభిమానులకు గుర్తుకు వస్తాయి. ఒకటి మయోసైటిస్ కాగా, రెండోది నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం. అభిమానులు మాత్రం నాగచైతన్య-సమంత మళ్లీ కలిసిపోవాలని కోరకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతుంటుంది. తాజాగా తమిళనాడులోని వెల్లూరులో ఓ కార్యక్రమానికి హాజరైంది. వైట్ షర్ట్, బ్లూ జీన్స్ తో వచ్చిన సమంత అక్కడ బాత్ రూమ్ లో ఫొటోలు తీసి షేర్ చేసింది. సమంత ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కావడంలేదని, నాగచైతన్యతో విడాకులైన తర్వాతే ఇలా వ్యవహరిస్తోందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

నాగచైతన్యతో ప్రేమ, పెళ్లికి ముందు సమంత ఎంత పాపులర్ అయిందో విడాకులు తీసుకున్న తర్వాత అంతకంటే ఎక్కువ పాపులరైంది. దీనికితోడు వేణుస్వామి లాంటి జ్యోతిష్యలు తాము ఈ విషయాన్ని ముందే చెప్పామంటూ వారుకూడా పాపులరై పోతుంటారు. విడాపోతారని చెప్పాడుకానీ కలిసిపోతారని మాత్రం చెప్పడంలేదు. వాస్తవానికి నాగచైతన్యకు, సమంతకు మధ్య ఇప్పటికీ ఒకరిపై మరొకరికి చెప్పలేనంత ప్రేమ ఉందని, చిన్న చిన్న అపోహలవల్లే విడిపోయారని, వారు మళ్లీ కలిసిపోవాలని తాము బలంగా కోరుకుంటున్నామంటూ అక్కినేని అభిమానులు కామెంట్లు పెడుతుంటారు.












Click it and Unblock the Notifications