సినిమాల్లోకి రాకముందే మహేష్‌బాబుతో టచ్‌లో ఉన్నా: త్రిష
సినిమాల్లో నటించిన అందమైన హీరో, హీరోయిన్లలో మహేష్ బాబు - త్రిష జంట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. అతడు సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతమని చెప్పొచ్చు. దీనితర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో సైనికుడు చిత్రంలో నటించారు. ఈ సినిమా థియేటర్లలో సరిగా ఆడలేదుకానీ చిన్నతెరపై మాత్రం అనేక రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమా తర్వాత పోకిరిలో త్రిషను తీసుకుందామనుకున్నారుకానీ జంట కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఇలియానాను తీసుకున్నారు. సైనికుడు చిత్రం తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు.
కాలేజీ రోజుల నుంచే పరిచయం ఉంది
ఓ సందర్భంలో ఇంటర్వ్యూ ఇస్తు మహేష్ బాబుపై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లోకి రాకముందే తామిద్దరికీ పరిచయం ఉందని చెప్పింది. ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ మహేష్ బాబుపై మీ అభిప్రాయం ఏమిటని అడగ్గా తనకు ఎంతో ఇష్టమైన హీరోల్లో మహేష్ బాబు ఒకరని చెప్పింది. ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే కాలేజీలో చదువుకునే రోజుల్లోనే తామిద్దరికీ మంచి పరిచయం ఉందని చెప్పింది. మహేష్ బాబు చెన్నైలో చదువుకునే రోజుల్లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడినట్లు త్రిష వెల్లడించింది.

భవిష్యత్తులో నటులవుతామని అనుకోలేదు
భవిష్యత్తులో తాము నటులవుతామని అనుకోలేదని, అప్పుడు మాకు తెలియదని, కలిసినప్పుడల్లా హాయ్ అని, తర్వాత వెళ్లిపోయేటప్పుడు బై అని చెప్పుకునేవారిమని త్రిష చెప్పింది. హీరో అయిన తర్వాత ప్రిన్స్ ఎంతో కష్టపడతాడని, ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ అందరినీ ఎంతో గౌరవించడం చూస్తుంటే తనకు ఎంతో ఆనందం అనిపించేదని, ఎంతో స్ఫూర్తివంతంగా ఉండేదన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా సెట్స్ లో ఉంటారని, అందరి నటులను గమనిస్తుంటారని, మానిటర్ ముందు కూర్చొని జరిగిన షూటింగ్ ను పరిశీలిస్తారని చెప్పింది. అతను అంతలా కష్టపడుతుంటే తనకు ఎంతో గిల్టీగా అనిపించేదన్నారు. అతను కష్టపడే తీరు తనకు స్ఫూర్తిగా నిలుస్తుందని త్రిష వెల్లడించింది. ప్రస్తుతం ఆమె విశ్వంభర చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తోంది. మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు సిద్ధమవుతున్నాడు.












Click it and Unblock the Notifications