అల్లు అర్జున్‌తో నటించను.. స్టార్ హీరోయిన్ సంచలనం

హీరో అల్లు అర్జున్ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అల్లు రామలింగయ్య మనవడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అల్లు అర్జున్. అప్పట్లో మెగా ఫ్యామిలీ అండదండలు కూడా అల్లు అర్జున్‌కు పుష్కలంగా ఉండటంతో , ఆయన స్టార్ హీరోగా ఎదిగాడు. అల్లు అర్జున్ డ్యాన్స్‌లకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. మెగా హీరోలకు ధీటుగా అల్లు అర్జున్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నారాయన. ఆయన పేరు మీద ఓ ఆర్మీ ఉందంటే అల్లు అర్జున్ పాపులారిటీ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాలతో పాటు, కేరళలో కూడా అల్లు అర్జున్‌కు విపరీతమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ సినిమాలు విడుదలవుతుంటే అక్కడి స్టార్ హీరోల సినిమాలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునే పరిస్థితి. అంతలా బన్నీని కేరళ ఫ్యాన్స్ అభిమానిస్తారు. ఇక పుష్ప సినిమాతో నార్త్‌లో కూడా అల్లు అర్జున్ తన స్టామినా నిరూపించుకున్నారు. పుష్పలో అల్లు అర్జున్ మ్యానరిజానికి బాలీవుడ్ అభిమానులు ఫిదా అయ్యారు. పుష్ప పార్ట్ 2 కోసం తెలుగు ప్రజల కన్నా బాలీవుడ్ జానాలే అతృతుగా ఎదురు చూశారు. పుష్ప పార్ట్ 2 సినిమా బాలీవుడ్‌లో విధ్వంసమే సృష్టించింది. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప-2 నిలిచింది.

heroine who said no to Allu Arjun and Atlee s movie

పుష్ప-2 సినిమాతో ఇండియాన్ బాక్సాఫీస్ లెక్కలను మార్చేశారు అల్లు అర్జున్. ఈ సినిమాతో అల్లు హీరో పాపులారిటీ కూడా మారిపోయింది. ఇక మీదట ప్యాన్ ఇండియా సినిమాల్లో మాత్రమే నటించడానికి ఆయన సముఖత వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కీలక ఆప్డేట్‌ను అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఎనౌన్స్ చేశారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు రాని కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎంపిక విషయంలో దర్శకుడు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది.

తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను తీసుకోవాలని భావించారట దర్శకుడు అట్లీ. అయితే అల్లు అర్జున్ సినిమాకు ప్రియాంక చోప్రా నో చెప్పినట్టు సమాచారం అందుతోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబుతో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో ప్రియాంక చోప్రా నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్నారు. డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి ప్రియాంక చోప్రా తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో సమంతను హీరోయిన్‌గా తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది.

అటు అట్లీ, ఇటు అల్లు అర్జున్ ఇద్దరితోనూ సమంత పని చేశారు. అట్లీ దర్శకత్వం వహించిన మెర్సిల్ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించారు. అలాగే , అల్లు అర్జున్ , సమంత కాంబినేషన్‌లో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ ముగ్గురు కలిసి హిట్ మ్యాజిక్‌ను రిపీట్ చేయలని చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాకు కలానిథి మారన్ నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+