కోర్టు కేసులో జూనియర్ ఎన్టీఆర్‌కు భారీ ఊరట
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు. దీన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. అందులో మొదటి భాగం సెప్టెంబరు 27వ తేదీన విడుదల కాబోతోంది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ స్వరాలందిస్తున్నారు. మిక్కిలినేని సుధాకర్, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబరు 10కి వాయిదా పడింది. అక్కడి నుంచి రెండు వారాలు ముందుకు జరిగి సెప్టెంబరు 27కు వచ్చింది.
డీఆర్టీ ఉత్తర్వులు కొట్టివేత
హైదరాబాద్ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో గతంలోనే స్థలం కొనుగోలు చేసి ఇంటిని నిర్మించుకున్నారు తారక్. ఈ ఇంటి హక్కులకు సంబంధించిన వివాదం కోర్టులో నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో యంగ్ టైగర్ కు భారీ ఊరట దక్కింది. ఆ ఇంటిపై బ్యాంకుకు హక్కులు ఉంటాయంటూ డీఆర్టీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తారక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

తాకట్టు పెట్టి రుణం తీసుకున్న సుంకు గీత
ఈ పిటిషన్ పై తాజాగా విచారణను చేపట్టిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలను విని డీఆర్టీ ఆదేశాలను రద్దుచేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఇరు పక్షాల వానదలను డీఆర్టీ మళ్లీ వినాలంటూ ఆదేశాలు జారీచేసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత నుంచి ఎన్టీఆర్ 2003లో కోనుగోలు చేశాడు. అయితే 1996లోనే ఈ స్థలాన్ని గీత పలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకుంది. ఈ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో స్థలంపై హక్కులు తమకే ఉంటాయంటూ బ్యాంకులు నోటీసులు జారీచేశాయి. దీనిపై ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుందామనుకుంటుంటే ఇటువంటి న్యాయ సంబంధమైన విషయాలను తమ హీరోను చికాకు పరుస్తున్నాయంటూ తారక్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications