ఆ టీవీ ఛానల్ చూడాలంటే అసహ్యంగా ఉంది.. తెలుగు హీరోయిన్ సంచలన పోస్ట్

నటి , తెలంగాణ బీజేపీ నాయకురాలు మాధవీలత ప్రముఖ ఛానెల్ ఈటీవీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు ఉన్నత విలువలకు, కుటుంబ ప్రేక్షకులకు మారుపేరుగా నిలిచిన ఈటీవీ, ఇప్పుడు మారిన తీరుపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తాను కెరీర్ మొదలుపెట్టిన ఈటీవీ ఛానెల్స్‌పైనే ఆమె విమర్శలు గుప్పిస్తూ పెట్టిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఒకప్పుడు ఉన్నత విలువలకు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈటీవీ, ఇప్పుడు మారిన తీరుపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

I hate watching the TV channel - Actress Madhavi Latha

మాధవీలత తన పోస్ట్‌లో, తాను ఈనాడు ఛానెల్స్‌లో యాంకర్‌గా పనిచేసి, ఉష కిరణ్ మూవీస్ ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యానని గుర్తు చేసుకున్నారు. ఆ సంస్థ తనకు మాతృసంస్థ లాంటిదని, ఇప్పటికీ రామోజీ రావు గారి సంస్థల వారు తనను "మా అమ్మాయి" అని ఆప్యాయంగా పిలుస్తారని చెప్పారు. అందుకే, ప్రస్తుతం కొన్ని టీవీ షోలను చూస్తుంటే ఎంతో బాధగా, అసహ్యంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

మారుతున్న పోటీ ప్రపంచాన్ని అర్థం చేసుకోగలనని చెప్పిన మాధవీలత, మితిమీరిన బూతులు, అసభ్యకరమైన ఐటమ్ సాంగ్స్, బట్టలిప్పుకున్న విధానం వంటివి తనకు చాలా ఇబ్బందికరంగా అనిపించాయని అన్నారు.కుటుంబ సభ్యులతో కాదు కదా, నా ఫ్రెండ్స్‌తో కలిసి కూడా కొన్ని షోస్ చూడాలంటే సిగ్గుగా ఉంది, అన్-ఈజీగా ఉందంటూ ఆమె తన మనసులోని బాధను వెళ్లగక్కారు.

ఈనాడు లాంటి సంస్థ ఎంతోమందికి అన్నం పెట్టిందని, విలువలతో కూడిన కంటెంట్‌తో ఎప్పుడూ భిన్నంగా నిలిచిందని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అలాంటి సంస్థలో వస్తున్న కొన్ని షోలను చూస్తే సామాజిక బాధ్యతగా ఈ పోస్ట్ పెట్టక తప్పలేదని ఆమె స్పష్టం చేశారు. ఒకప్పుడు ఈటీవీని చూసి ఎన్నో కుటుంబాలు ఎంతో ఆనందించేవని, ఇప్పుడు ఆ టీవీ ఛానల్ చూడాలంటే అసహ్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.మాధవీలత షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+