అతనితో సినిమాలు చేసి తప్పు చేశా- సమంత
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత, తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది.ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది.
నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి మధ్య తీవ్ర విభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. విడాకుల అనంతరం సమంత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.ఇదిలా ఉంటే సమంత ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె రియాక్ట్ అయ్యారు.తన 15 ఏళ్ళ కెరీర్ గురించి గుర్తు చేసుకుంటూ..అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు.. మరెన్నో చేదు అనుభవాలున్నాయంటూ చెప్పుకొచ్చింది. జీవితంలో కొన్ని విషయాలు ఎంత మర్చిపోవాలన్నా మరిచిపోలేం అని.. కొన్ని మాత్రం ఇట్టే మరిచిపోతామంటూ సమంత తెలిపింది.

ముఖ్యంగా తన మాజీ భర్తతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సినిమాను సమంత ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.ఏ మాయ చేసావేలో ప్రతీ సీన్ తనకు గుర్తుందని.. గేట్ దగ్గర నిలబడి కార్తిక్‌ను కలిసేది తనకు ఫస్ట్ సీన్ అన్నారు సమంత.అలాగే కొన్ని సినిమాల్లో నటించి తప్పు చేశానని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కొంతమందితో నటించి తప్పు చేశాననే అర్థం వచ్చేలా కొన్ని కామెంట్స్ చేసింది. కొన్నేళ్ల కెరీర్‌లో తన జీవితంలో ఎన్నో చూసానని.. తన బలమేంటి.. బలహీనతలేంటి అర్థమైందని తెలిపారు సమంత. రాబోయే 15 ఏళ్ళ కోసం వేచి చూస్తున్నానని సమంత తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.












Click it and Unblock the Notifications