అమెజాన్ కు గట్టి షాక్ ఇచ్చిన అల్లు అర్జున్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ మూవీ అతని కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాద్వారా అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఇటీవలే ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. ఇలా ఉంటే పుష్ప ది రూల్ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన ఇది విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది.
పుష్ప2 సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ తో సంస్థ ఈ భారీ డీల్ కుదుర్చుకుంది. హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ తో పోటీపడింది. నిర్మాతలు భారీగా డిమాండ్ చేయడంతో అమెజాన్ ప్రైమ్ వెనక్కి తగ్గింది. నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి కోట్ చేసి దక్కించుకుంది. 2021లో వచ్చిన పుష్ప1 హక్కులను అమెజాన్ రూ.30 కోట్లకు దక్కించుకుంది. తాజాగా వస్తున్న సీక్వెల్ అంతకు మూడు రెట్లు అధికంగా నెట్ ఫ్లిక్స్ చెల్లించింది. సుమారు రూ.100 కోట్లకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. పుష్ప 2 సినిమాకు క్రేజ్ ఉండటంతో భారీమొత్తం చెల్లించేందుకు నెట్ ఫ్లిక్స్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పుష్ప మొదటి భాగంలో ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అనే సాంగ్ బాగా హైలైటైంది. సమంత ఈ ప్రత్యేక గీతంలో నర్తించారు. రెండో భాగంలో కూడా అటువంటి ప్రత్యేక పాటను సుకుమార్ చిత్రీకరించబోతున్నారు. అందులో ఎవరు నటిస్తారనే విషయం బయటకు రాలేదు.












Click it and Unblock the Notifications